పోతిరెడ్డిపాడు నుంచి నీటి విడుదల

ABN , First Publish Date - 2021-07-30T04:57:25+05:30 IST

మండల పరిధిలోని పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ నుంచి గురువారం నీటి విడుదల పెంచి 15వేల క్యూసెక్కులను ఎస్‌ఆర్‌ఎంసీ కాల్వలోకి వదిలినట్లు నీటిపారుదలశాఖ ఏఈ విష్ణువర్ధనరెడ్డి తెలిపారు.

పోతిరెడ్డిపాడు నుంచి  నీటి విడుదల


జూపాడుబంగ్లా, జూలై: మండల పరిధిలోని పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ నుంచి గురువారం నీటి విడుదల పెంచి 15వేల క్యూసెక్కులను ఎస్‌ఆర్‌ఎంసీ కాల్వలోకి వదిలినట్లు నీటిపారుదలశాఖ ఏఈ విష్ణువర్ధనరెడ్డి తెలిపారు. 4గేట్ల నుంచి విడుదల అవుతున్న నీటిని బానుకచెర్ల నీటిసముదాయం నుంచి తెలుగుగంగకు మళ్లించినట్లు ఆయన తెలిపారు.  


వీబీఆర్‌లో 5.749టీఎంసీల నీటినిల్వలు 

ఆత్మకూరు(వెలుగోడు), జూలై 29: వెలుగోడు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌కు 5.749 టీఎంసీల నీటినిల్వలు నమోదయ్యాయి. గురువారం నీటిలెక్కలు లెక్కించే సమయానికి జలాశయం గరిష్ట నీటిసామర్థ్యం 16.95టీఎంసీలకు గానూ 5.749 టీఎంసీల నీటినిల్వలు చేరుకొని 841.17అడుగులు నీటిమట్టం నమోదైంది. కాగా వెలుగోడు జలాశయానికి బానుకచెర్ల హెడ్‌రెగ్యులేటర్‌ నుంచి తెలుగుగంగ కాల్వ ద్వారా 12వేల క్యూసెక్కులు, గాలేరు నుంచి 40క్యూసెక్కుల నుంచి చొప్పున మొత్తం 12040 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. అలాగే జలాశయం నుంచి వనఆర్‌ తూము ద్వారా 20 క్యూసెక్కులు, వనఎల్‌ తూము ద్వారా 20 క్యూసెక్కుల నీటితో పాటు చెన్నై ప్రధాన కాల్వ 70క్యూసెక్కుల చొప్పున మొత్తం 110క్యూసెక్కుల నీరు ఔట్‌ఫ్లోగా ఉన్నట్లు తెలుగుగంగ ఏఈఈ మంజునాథ్‌ తెలిపారు. ఇదిలావుంటే 24 గంటల వ్యవధిలో వీబీఆర్‌లోకి సుమారు ఒక టీఎంసీపైగా వరదజలాలు చేరుకున్నాయి. అలాగే బానుకచర్ల హెడ్‌రెగ్యులేటర్‌ నుంచి వెలుగోడు జలాశయానికి చేరుకునే తెలుగుగంగ కాల్వ నీటిప్రవాహంతో నిండుకుండలా దర్శనమిస్తోంది.


Updated Date - 2021-07-30T04:57:25+05:30 IST