తెలుగుగంగ కాల్వకు నీటి విడుదల

ABN , First Publish Date - 2020-08-08T09:52:23+05:30 IST

భానకచెర్ల క్రాస్‌రెగ్యులేటర్‌ నుంచి తెలుగుగంగ కాల్వకు 1000 క్యూసె క్కుల నీరు విడుదల చేస్తున్నారు.

తెలుగుగంగ కాల్వకు నీటి విడుదల

పాములపాడు, ఆగస్టు 7: భానకచెర్ల క్రాస్‌రెగ్యులేటర్‌ నుంచి తెలుగుగంగ కాల్వకు 1000 క్యూసె క్కుల నీరు విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు నుంచి శ్రీశైలం కుడి గట్టు ప్రధాన కాల్వ ద్వారా భానక చెర్ల క్రాస్‌ రెగ్యులేటర్‌ వద్ద్దకు 1000 క్యూసెక్కుల నీరు చేరుతోంది. అక్కడి నుంచి కేవలం తెలుగుగంగ కాల్వకు మాత్రమే నీటి విడుదల చేస్తున్నట్లు క్రాస్‌ రెగ్యులేటర్‌ జేఈ దేవేంద్ర శుక్రవారం తెలిపారు. ఎస్సార్బీసీ కాల్వకు, కేసీసీ ఎస్కేప్‌ ఛానల్‌కు నీటి విడుదల చేయలేదు. ఇదిలా ఉండగా 1500 క్యూసెక్కుల నీటి విడుదల తగ్గినట్లు పేర్కొన్నారు. 


Updated Date - 2020-08-08T09:52:23+05:30 IST