Aryan Khan కేసులో మంత్రి నవాబ్ మాలిక్ సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2021-10-26T15:59:58+05:30 IST

ఆర్యన్‌ఖాన్‌ కేసు విచారణలో భాగంగా డ్రగ్స్‌ నిరోధక సంస్థపై మహారాష్ట్ర మంత్రి నవాబ్‌ మాలిక్‌ మంగళవారం కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు...

Aryan Khan కేసులో మంత్రి నవాబ్ మాలిక్ సంచలన వ్యాఖ్యలు

ఎన్సీబీ అధికారి లేఖ త్వరలో విడుదల చేస్తా...

ముంబై : ఆర్యన్‌ఖాన్‌ కేసు విచారణలో భాగంగా డ్రగ్స్‌ నిరోధక సంస్థపై మహారాష్ట్ర మంత్రి నవాబ్‌ మాలిక్‌ మంగళవారం కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి మాలిక్ మంగళవారం ఉదయం కూడా ట్వీట్‌లు కొనసాగించారు. పేరులేని ఓ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారి నుంచి తాను కవరు అందుకున్నట్లు మంత్రి  వెల్లడించారు. త్వరలో వివరాలను వెల్లడిస్తానని మంత్రి పేర్కొన్నారు.‘‘అందరికీ శుభోదయం, త్వరలో విడుదల చేస్తున్నాను...‘స్పెషల్ 26’ అని ట్వీట్‌లో నవాబ్ మాలిక్ ప్రకటించారు.‘‘పేరు తెలియని ఎన్సీబీ అధికారి నుంచి నాకు వచ్చిన లేఖను ట్విట్టర్‌లో త్వరలో విడుదల చేస్తాను.’’ అని మంత్రి చెప్పారు. 


సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌ను నిందితుడిగా గుర్తించిన డ్రగ్స్ ఆన్ క్రూయిజ్ కేసులో ఎన్‌సీబీ అధికారులు,బీజేపీ నాయకులు కుమ్మక్కు అయ్యారని మాలిక్ ఆరోపించారు. తన అల్లుడు కూడా డ్రగ్స్ కేసులో 9 నెలల క్రితం అరెస్టు అయ్యాడని,గత నెల 27వతేదీన అతనికి బెయిలు మంజూరు అయిందని, తనకు న్యాయవ్యవస్థపై పూర్తి నమ్మకం ఉందని మంత్రి చెప్పారు.సమీర్ వాంఖడే ఆర్యన్ ఖాన్ కేసులో విచారణకు నాయకత్వం వహిస్తున్న అధికారి. వాంఖడేతో ముడిపడి ఉన్న కేసులో ఒక సాక్షి ద్వారా అక్రమ వసూలు డిమాండ్ల ఆరోపణలు ఆదివారం బయటపడ్డాయి.

Updated Date - 2021-10-26T15:59:58+05:30 IST