జియో నయా ఆఫర్: HP Smart SIM Laptopతో 100 జీబీ ఉచిత డేటా

ABN , First Publish Date - 2022-07-17T02:59:39+05:30 IST

హెచ్‌పీ స్మార్ట్ సిమ్ ల్యాప్‌టాప్ కొనుగోలు చేయాలనుకునే వారికి జియో గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ ల్యాప్‌టాప్ కొనుగోలుదారులకు

జియో నయా ఆఫర్: HP Smart SIM Laptopతో 100 జీబీ ఉచిత డేటా

న్యూఢిల్లీ:  హెచ్‌పీ స్మార్ట్ సిమ్ ల్యాప్‌టాప్ కొనుగోలు చేయాలనుకునే వారికి జియో గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ ల్యాప్‌టాప్ కొనుగోలుదారులకు  ఏడాది కాలపరిమితితో రూ. 1500 విలువైన 100 జీబీ ఉచిత డేటా అందించనున్నట్టు ప్రకటించింది. ఎల్‌టీఈ ల్యాప్‌టాప్‌లలో హెచ్‌పీ స్మార్ట్ సిమ్ లైఫ్ మొట్టమొదటిది కావడం గమనార్హం. ఉచిత డేటా కోసం యూజర్లు జియో హెచ్‌పీ స్మార్ట్ సిమ్ కలిగి ఉండాలి.


హెచ్‌పీకి చెందిన కొన్ని ల్యాప్‌టాప్‌ మోడళ్లకే ఈ ఆఫర్ వర్తిస్తుందని జియో తెలిపింది. కాగా, ప్రస్తుతం రెండు మోడళ్లు HP 14ef1003tu, HP 14ef1002tu మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ల్యాప్‌టాప్ కొనుగోలు‌తో పాటు వచ్చే ఉచిత జియో సిమ్‌ను యాక్టివేట్ చేసుకున్న తర్వాత డేటా ప్యాక్ అమల్లోకి వస్తుంది. ఈ పరిమితి దాటిన తర్వాత డేటా వేగం 64 కేబీపీఎస్ పడిపోతుంది. ఆ తర్వాతి నుంచి జియో ప్యాక్‌లను యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. రిలయన్స్ డిజిటల్, జియోమార్ట్, హెచ్‌పీ స్మార్ట్ ల్యాప్ టాప్ పోర్టళ్ల నుంచి ఆన్‌లైన్ ద్వారా కూడా ల్యాప్‌టాప్‌ను కొనుగోలు చేసుకోవచ్చు.

Updated Date - 2022-07-17T02:59:39+05:30 IST