Reliance Jio 5G Plans: రిలయన్స్ 5జీ పనిచేసేది ఈ ప్లాన్లపైనే!

ABN , First Publish Date - 2022-10-07T21:33:14+05:30 IST

దేశంలోని అతిపెద్ద టెలికం సంస్థ రిలయన్స్ జియో (Reliance Jio 5G) ఇటీవల తన 5జీ సర్వీసులను ప్రారంభించింది.

Reliance Jio 5G Plans: రిలయన్స్ 5జీ పనిచేసేది ఈ ప్లాన్లపైనే!

న్యూఢిల్లీ: దేశంలోని అతిపెద్ద టెలికం సంస్థ రిలయన్స్ జియో (Reliance Jio 5G) ఇటీవల తన 5జీ సర్వీసులను ప్రారంభించింది. దేశ రాజధాని ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, వారణాసిలో సేవలు ప్రారంభమయ్యాయి. ఈ నగరాల్లో కనుక మీరు సిమ్‌కార్డు కొని ఉంటే మీరు జియో 5జీ (Jio 5G) సేవలను వినియోగించుకోవచ్చు. అయితే, ఇది అందరికీ కాదు సుమా!


మై జియో యాప్ ద్వారా 5జీ సేవలకు సంబంధించి ఆహ్వాన మెసేజ్ వచ్చిన వారికి మాత్రమే సేవలు అందుతాయి. కాబట్టి మీరు ఆ సేవలు పొందేందుకు అర్హులు అవునో?  కాదో? తెలుసుకునేందుకు తొలుత మై జియో యాప్‌ (My Jio App)ను చెక్ చేసుకోవాలి. అందులో కనుక మీకు ఇన్వైట్ మెసేజ్ వచ్చి ఉంటే మీరు 5జీ సర్వీసులను ఎంజాయ్ చేయొచ్చు. ఈ మెసేజ్ పైన కరౌసెల్‌లో కనిపిస్తుంది.  


5జీ ప్లాన్ ఇలా.. 

1 జీబీపీఎస్ వేగంతో జియో (Jio) అందిస్తున్న వెల్కమ్ ఆఫర్ (Welcome Offer) అందుకోవాలంటే రూ. 239తో రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రీపెయిడ్, పోస్టుపెయిడ్ ఖాతాదారులకు ఇది అందుబాటులో ఉంది. వెల్కమ్ ఆఫర్ పనిచేయాలంటే కనీసం రూ. 239 నుంచి ఆపై ఎంతైనా రీచార్జ్ చేసుకోవచ్చని జియో తెలిపింది. రూ. 239లోపు ప్లాన్లతో రీచార్జ్ చేయిస్తే మాత్రం వెల్కమ్ ఆఫర్ వర్తించదు. 5జీ విషయంలో ఖాతాదారుల అనుభవాన్ని తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు ఆగక తప్పదు. 


జియో వెల్కమ్ ఆఫర్‌లో ప్రయోజనాలు 

చెల్లుబాటు అయ్యే ప్యాక్ ఉంటే 5జీ డేటాను పొందొచ్చని జియో (Reliance jio) చెబుతోంది. ఈ ప్యాక్‌తో అందే డేటా 4జీ స్పీడ్‌తో వస్తుంది. అయితే, 5జీకి మారితే కనుక అదనంగా అపరిమిత డేటా లభిస్తుంది. జియో యూజర్లు ఎన్ 28, ఎన్ 78, ఎన్258 బ్యాండ్లపై 5జీని పొందొచ్చని రిలయన్స్ జియో (Reliance jio) తెలిపింది. అంతకంటే ముందు యూజర్లు తమ స్మార్ట్‌ఫోన్లు 5జీకి సపోర్ట్ చేస్తాయా? లేదా? అన్న విషయాన్ని నిర్ధారించుకోవాల్సి ఉంటుంది.

Updated Date - 2022-10-07T21:33:14+05:30 IST