రిలయన్స్... రెండు రోజుల్లో 7 % పతనం...

ABN , First Publish Date - 2022-01-26T01:39:41+05:30 IST

కిందటి వారంలో మంచి జోరును కనబరచిన రిలయన్స్ ఇండస్ట్రీస్... ఈ వారం మాత్రం ప్రారంభం నుంచే డౌన్ అయ్యింది.

రిలయన్స్... రెండు రోజుల్లో 7 % పతనం...

 మార్కెట్ క్యాప్‌లో రూ.1 ట్రిలియన్‌కు పైగా నష్టం... 

ముంబై : కిందటి వారంలో మంచి జోరును  కనబరచిన రిలయన్స్ ఇండస్ట్రీస్... ఈ వారం మాత్రం ప్రారంభం నుంచే డౌన్ అయ్యింది. షాపూర్జీ పల్లోంజీ కంపెనీ రిలయన్స్ వెంచర్స్ లిమిటెడ్ (ఆర్‌వీఎల్) రూ. 750 కోట్ల రుణంపై కంపెనీ స్పష్టత ఇచ్చినప్పటికీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు మంగళవారం(ఈ రోజు) ఇంట్రా-డేలో 3 శాతం క్షీణించి, రూ. 2,305 కు చేరాయి. గత రెండు ట్రేడింగ్ సెషన్‌లలో రిలయన్స్ షేర్లు 7 శాతం నష్టపోయాయి. స్టాక్ ధరలో క్షీణత చోటుచేసుకుంది. గత రెండు ట్రేడింగ్ రోజుల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 1.17 ట్రిలియన్ల మేర తగ్గింది.

Updated Date - 2022-01-26T01:39:41+05:30 IST