రిలయన్స్‌ అదరహో

ABN , First Publish Date - 2022-01-22T08:12:27+05:30 IST

ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) మరోసారి తన సత్తా చాటింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో అద్భుతమైన ఫలితాలను ప్రకటించింది....

రిలయన్స్‌ అదరహో

క్యూ3 లాభం రూ.18,549 కోట్లు 

 రూ.1.91 లక్షల కోట్లకు చేరిన ఆదాయం

 జోరుగా రిఫైనింగ్‌, రిటైల్‌ వ్యాపారాలు

 రూ.50,000 కోట్లు దాటిన రిటైల్‌ బిజినెస్‌

 త్వరలో వెయ్యి నగరాల్లో 5జీ సేవలు


న్యూఢిల్లీ : ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) మరోసారి తన సత్తా చాటింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో అద్భుతమైన ఫలితాలను ప్రకటించింది. అక్టోబరు-డిసెంబరు కాలానికి గాను కంపెనీ రూ.1.91 లక్షల కోట్ల ఆదాయంపై రూ.18,549 కోట్ల భారీ లాభాన్ని ప్రకటించింది. 2020-21 ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ఆదాయం ఏకంగా 54 శాతం, నికర లాభం 42 శాతం పెరిగాయి. ఆయిల్‌ టు కెమికల్స్‌ (ఓ2సీ), రిటైల్‌ వ్యాపారాలు ఇందుకు ప్రధానంగా దోహదం చేశాయి. అమెరికా షేల్‌ గ్యాస్‌ కంపెనీలో వాటా అమ్మకం ద్వారా రూ.2,872 కోట్లు రావడం, కేజీ బేసిన్‌లో కొత్త గ్యాస్‌ బావుల నుంచి ఉత్పత్తి ప్రారంభం ఇందుకు మరింత కలిసొచ్చాయి. సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికంతో పోల్చినా డిసెంబరు త్రైమాసికంలో రిలయన్స్‌ మంచి ఆర్థిక ఫలితాలు సాధించింది.


డిసెంబరు త్రైమాసికంలో కంపెనీ నమోదు చేసిన స్థూల లాభంలో (ఈబీఐటీడీఏ) నాలుగింట మూడొంతులు.. రూ.13,530 కోట్ల లాభం ఓ2సీ, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ వ్యాపారాల ద్వారా సమకూరింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 38.7 శాతం, సెప్టెంబరు త్రైమాసికంతో పోలిస్తే 6.3 శాతం ఎక్కువ. ఆర్థిక వ్యవస్థ కోలుకోవటంతో పాటు డిమాండ్‌ ఊపందుకోవటం రిపైనింగ్‌ లాభాలు పెరగటానికి ప్రధానంగా దోహదపడ్డాయి.     కంపెనీ ఓ2సీ వ్యాపారం వరుసగా గత ఆరు త్రైమాసికాల నుంచి లాభాలు నమోదు చేసుకుంటూ వస్తుండటం విశేషం.


దసరా, దీపావళి పండగల సీజన్‌ రిలయన్స్‌ రిటైల్‌ వ్యాపారాలకు బాగా కలిసొచ్చింది. ఈ విభాగం తొలిసారిగా రూ.57,714 కోట్ల ఆదాయం నమోదు చేసింది. దీంతో డిసెంబరు త్రైమాసికంలో కంపెనీ నికర లాభం 23.4 శాతం పెరిగి రూ.2,259 కోట్లకు చేరింది. జువెలరీ, ఎలకా్ట్రనిక్స్‌, గ్రోసరీ అమ్మకాలు ఇందుకు ప్రధానంగా దోహదం చేశాయి. కర్ఫ్యూలు, లాక్‌డౌన్లు లేకపోవడం ఇందుకు కలిసొచ్చాయి. డిసెంబరు త్రైమాసికంలో రిలయన్స్‌ రిటైల్‌ కొత్తగా 837 స్టోర్లు ప్రారంభించింది. దీంతో కంపెనీ స్టోర్ల సంఖ్య 14,412కు చేరింది.


 ఇతర ప్రధాన అంశాలు 

జూడిసెంబరు నాటికి రూ.2,41,846 కోట్ల నగదు నిల్వ లు. రూ.2,44,708 కోట్ల స్థూల అప్పులు

జూక్యూ3లో ఐదింతలు పెరిగిన ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ విభాగం ఆదాయం

జూకేజీ బేసిన్‌ నుంచి కొత్తగా రోజుకు 1.8 కోట్ల ప్రామాణిక ఘనపు మీటర్ల గ్యాస్‌ ఉత్పత్తి

జూ2022 డిసెంబరు త్రైమాసికం నుంచి కేజీ బేసిన్‌లోని ఎంజే క్షేత్రం నుంచి ఉత్పత్తి

జూచురుగ్గా 5జీ ట్రయల్స్‌. త్వరలో 1,000 నగరాల్లో 5జీ సేవలు 


జియో లాభం రూ.3,795 కోట్లు 

డిసెంబరు త్రైమాసికంలో రిలయన్స్‌ టెలికాం వెంచర్‌ రిలయన్స్‌ జియో కూడా మంచి ఫలితాలు సాఽధించింది. ఈ కాలానికి కంపెనీ రూ.24,176 కోట్ల ఆదాయంపై రూ.3,795 కోట్ల నికర లాభం నమోదు చేసింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఆదాయం 5.76 శాతం, నికర లాభం 8.8 శాతం పెరిగాయి. సెప్టెంబరు త్రైమాసికంలో రూ.143.6 ఉన్న ఒక్కో వినియోగదారుడి నుంచి వచ్చే సగటు ఆదాయం (ఏఆర్‌పీయూ) డిసెంబరు త్రైమాసికంలో రూ.151.60కి చేరింది. ఇది దాదాపు గత ఆర్థిక సంవత్సరం (2020-21) మూడో త్రైమాసికంలో సాఽధించిన రూ.151 ఏఆర్‌పీయూకు సమానం. జియోఫోన్‌ నెక్స్ట్‌ విడుదలతో డిసెంబరు త్రైమాసికంలో జియో కొత్తగా 102 లక్షల మంది ఖాతాదారులను సంపాదించింది. జియో చరిత్రలో తొలిసారిగా క్యూ3లో రూ.10,000 కోట్లకు మించి స్థూల లాభం నమోదు చేసింది. టారి్‌ఫల పెంపు ప్రభావం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో మరింత బలంగా కనిపిస్తుందని భావిస్తున్నారు. 


వ్యాపార అభివృద్ధి కోసం ఈ త్రైమాసికంలోనూ వ్యూహాత్మక పెట్టుబడులు, భాగస్వామ్యాలు కొనసాగిస్తాం.

- ముకేశ్‌ అంబానీ, చైర్మన్‌, ఆర్‌ఐఎల్‌

Updated Date - 2022-01-22T08:12:27+05:30 IST