డయాలసిస్‌ రోగులకు ఊరట

ABN , First Publish Date - 2022-08-17T06:36:11+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం నూ తనంగా డయాలసిస్‌ రోగులకు ఆసరా పింఛన్‌ వర్తింపజేయనుండడంతో వారికి కొంత ఊరట లభించింది. ప్రభు త్వం తీసుకున్న నిర్ణయం తో వారిలో హర్షం వ్యక్తమవుతోం ది. అనారోగ్యంతో చితికిపోతున్న వారికి ప్రభుత్వ నిర్ణయం తో ఆర్థికంగా కొంత ఉపశమనం కలగనుంది.

డయాలసిస్‌ రోగులకు ఊరట

ఆసరా పింఛన్‌ వర్తించనుండడంతో హర్షం

నల్లగొండ అర్బన్‌, ఆగస్టు 16: రాష్ట్ర ప్రభుత్వం నూ తనంగా డయాలసిస్‌ రోగులకు ఆసరా పింఛన్‌ వర్తింపజేయనుండడంతో వారికి కొంత ఊరట లభించింది. ప్రభు త్వం తీసుకున్న నిర్ణయం తో వారిలో హర్షం వ్యక్తమవుతోం ది. అనారోగ్యంతో చితికిపోతున్న వారికి ప్రభుత్వ నిర్ణయం తో ఆర్థికంగా కొంత ఉపశమనం కలగనుంది. మూత్రపిండాలు చెడిపోయి డయాలసిస్‌ చేసుకుంటున్న రోగులు ఆరోగ్యంగా, ఆర్థికంగానూ ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కిడ్నీ సంబంధిత వ్యాధు లు ఎంతో ఖర్చుతో కూడుకున్నవి. సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఈ వ్యాధుల బారిన పడితే ఇల్లు, ఒళ్లు గుళ్ల కావాల్సిందే. రాష్ట్ర ప్రభు త్వం డయాలసిస్‌ రోగుల బాధలను దృష్టిలో పెట్టుకుని నూతనంగా ప్రవేశపెట్టబోయే ఆసరా పింఛన్లలో వీరికి కూడా రూ.2,016 ఇవ్వనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం డయాలసిస్‌ రోగులకు ప్రభుత్వం ఆరోగ్య శ్రీ కింద ఉచితంగా డయాలసిస్‌ చేస్తోంది. అంతేకాకుండా నివాసం ఉండే ప్రాంతంనుంచి వారు ప్రయాణించే రూట్‌ బస్‌పా్‌సలు ఉచితంగా అందిస్తుంది. రక్తం పెరగడానికి ఉచితంగా ఐరన్‌ ఇంజక్షన్లను ఇస్తుంది. దీనికితోడు ఆసరా పింఛన్‌ కూడా ఇవ్వడం వల్ల రోగులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఉమ్మడి జిల్లా లో నల్లగొండ, హుజూర్‌నగర్‌, మిర్యాలగూడ, సూర్యాపేట ప్రాంతాల్లో ప్రభుత్వ ఆస్పత్రుల్లో డయాలసిస్‌ సెంటర్లు ఉన్నాయి. సుమారు 250 మంది డయాలసిస్‌ చేయించుకుంటున్నారు. ప్రైవేటు ఆస్పత్రిలో చేయించుకునే వారు సుమారు 1200 మంది ఉన్నా రు. వీరందరికీ ఆసరా పింఛన్‌ అందనుంది. రోగులకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నారు. జిల్లాలో ఎంతమంది డయాలసిస్‌ రోగులు ఉన్నారు? వారి వివరా లు సేకరించి ప్రభుత్వానికి సంబంధిత అధికారులు నివేది క పంపేందుకు చర్యలు చేపట్టారు. 

Updated Date - 2022-08-17T06:36:11+05:30 IST