ఉపశమనం

ABN , First Publish Date - 2022-09-26T04:39:59+05:30 IST

జిల్లావ్యాప్తంగా ఆదివారం వాతావరణం చల్లబడింది. పలుచోట్ల జల్లులు పడ్డాయి. రెండు, మూడు మండలాల్లో ఒక మోస్తరు వర్షం కురిసింది. దీంతో వారం రోజులుగా ఎండల తీవ్రతతో తల్లడిల్లుతున్న ప్రజలకు ఉపశమనం లభించింది. జిల్లాలో సాధారణంగా సెప్టెంబరులో ఎక్కువ రోజులు వర్షం కురుస్తుంది.

ఉపశమనం
ఒంగోలులో ఆదివారం సాయంత్రం కురుస్తున్న వర్షం

పలు ప్రాంతాల్లో జల్లులు

చల్లబడిన వాతావరణం

ఎండ తీవ్రత నుంచి ప్రజలకు ఊరట

ఒంగోలు, సెప్టెంబర్‌ 25 (ఆంధ్రజ్యోతి) : జిల్లావ్యాప్తంగా ఆదివారం వాతావరణం చల్లబడింది. పలుచోట్ల జల్లులు పడ్డాయి. రెండు, మూడు మండలాల్లో ఒక మోస్తరు వర్షం కురిసింది. దీంతో వారం రోజులుగా ఎండల తీవ్రతతో తల్లడిల్లుతున్న ప్రజలకు ఉపశమనం లభించింది. జిల్లాలో సాధారణంగా సెప్టెంబరులో ఎక్కువ రోజులు వర్షం కురుస్తుంది. అయితే ఈసారి ఇంచుమించు మూడు వారాలుగా సరైన వర్షం లేకపోగా వారం, పదిరోజుల నుంచి అత్యధిక ప్రాంతాల్లో ఎండల తీవ్రత సాధారణం కన్నా నాలుగైదు డిగ్రీలు పెరిగి 36 నుంచి 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దానికితోడు ఉక్కపోత కూడా అధికంగా ఉంటోంది. ఆదివారం మధ్యాహ్నం వరకూ అలాంటి వాతావరణమే ఉంది.  కురిచేడు, పొన్నలూరు, ఒంగోలు, చీమకుర్తి, మర్రిపూడి వంటి మండలాల్లో 37 నుంచి 39 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎండల తీవ్రత కొనసాగింది. ఆతర్వాత ఒక్కసారిగా వాతావరణంలో మార్పు వచ్చింది. అత్యధిక ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై వాతావరణం పూర్తిగా చల్లబడింది. కొన్నిచోట్ల వర్షం కూడా పడింది. సాయంత్రం 6 గంటల సమయానికి సింగరాయకొండలో గరిష్ఠంగా 28.75 మి.మీ వర్షపాతం నమోదైంది. కొత్తపట్నంలో 27.50, పెద్దారవీడు మండలంలో 21.50, జరుగుమల్లిలో 21.50, మర్రిపూడిలో 11.25, ఒంగోలులో 7.0 మి.మీ వర్షం కురిసింది. దోర్నాల, ముండ్లమూరు, దర్శి, కొండపి, త్రిపురాంతకం, పొన్నలూరుతోపాటు పలు ఇతర మండలాల్లో జల్లులు పడ్డాయి. 


Updated Date - 2022-09-26T04:39:59+05:30 IST