గొర్రెకుంట వద్ద రెమ్‌డెసివిర్‌ పట్టివేత?

ABN , First Publish Date - 2021-05-10T05:07:52+05:30 IST

గొర్రెకుంట వద్ద రెమ్‌డెసివిర్‌ పట్టివేత?

గొర్రెకుంట వద్ద రెమ్‌డెసివిర్‌ పట్టివేత?

గీసుగొండ, మే 9: కరోనా నివారణకు ఉపయోగించే రెమ్‌డిసివిర్‌ ఇంజక్ష న్‌ను అక్రమంగా కొంతమంది ప్రైవేటు వ్యక్తులు తీసుకెళ్తుంటే గీసుగొండ పోలీ సులు 15వ డివిజన్‌ గొర్రెకుంట వద్ద శనివారం పట్టుకున్నట్లు తెలిసింది. వారి వద్ద నుంచి సుమారు 42బాటిల్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సమాచా రం. నిబంధనలకు విరుద్ధంగా రెమ్‌ డిసివిర్‌ను తీసుకెళ్తున్న వారి నుంచి మరింత సమాచారాన్ని రాబట్టేందుకు పోలీసులు విచారిస్తున్నట్లు తెలిసింది. అక్రమ రాకెట్‌ను చేధించి రెమ్‌డిసివిర్‌ ఎంత వచ్చింది, ఎక్కడెక్కడికి సరాఫరా చేసింది అనే కోణంలో విచారిస్తున్నట్లు తెలిసింది.


Updated Date - 2021-05-10T05:07:52+05:30 IST