తప్పా! ఒప్పా!

ABN , First Publish Date - 2020-07-01T05:30:00+05:30 IST

ఆట సరదాగా ఉండాలి. స్కూల్లో చదువుకున్న పాఠాలను తిరిగి చదివినట్టుగా ఉండాలి అనుకుంటే ఈ గేమ్‌ని ఎంచుకోవాలి. ఈ ఆట ఆడటానికి...

తప్పా! ఒప్పా!

ఆట సరదాగా ఉండాలి. స్కూల్లో చదువుకున్న పాఠాలను తిరిగి చదివినట్టుగా ఉండాలి అనుకుంటే ఈ గేమ్‌ని ఎంచుకోవాలి. ఈ ఆట ఆడటానికి


కావలసినవి :

  1. చాక్‌పీస్‌ 
  2. పాఠ్యపుస్తకాల్లో నుంచి సేకరించిన కొన్ని ప్రశ్నలు 


ఎలా ఆడాలంటే...

  1. ఈ గేమ్‌ని ఎంతమందైనా ఆడొచ్చు. ముందుగా చాక్‌పీస్‌తో ఒక పొడవైన గీత గీయాలి. 
  2. అందరూ ఆ గీత మీద నిలబడాలి. ప్రశ్నలు అడిగే వ్యక్తి మాత్రం గీత బయట నిల్చోవాలి.
  3. ఈ ఆటకోసం తప్పొప్పుల ప్రశ్నలను మాత్రమే ఎంచుకోవాలి. జనరల్‌ నాలెడ్జ్‌కి సంబంధించిన ప్రశ్నలను కూడా తీసుకోవచ్చు.
  4. తప్పు సమాధానం చెప్పినవారు గీత నుంచి ఎడమ వైపు జంప్‌ చేయాలి. సరైన సమాధానం చెప్పిన వారు కుడి వైపు జంప్‌ చేయాలి.
  5. సమాధానం తప్పుగా ఎంచుకున్న వాళ్లు లైన్‌లో నుంచి బయటకు వెళ్లి కూర్చోవాలి.
  6. తిరిగి మళ్లీ కొత్త ప్రశ్న అడగాలి. చివరి వరకు సరైన సమాధానాలు చెబుతూ ఉన్న వారు గెలిచినట్టు!

Updated Date - 2020-07-01T05:30:00+05:30 IST