ఇన్‌స్టా నుంచి రీమిక్స్‌ ఫర్‌ రీల్స్‌

ABN , First Publish Date - 2021-04-03T05:56:00+05:30 IST

ఫోటోషేరింగ్‌ యాప్‌ ‘ఇన్‌స్టాగ్రామ్‌’‘రీమిక్స్‌ ఫర్‌ రీల్స్‌’ పేరిట ‘టిక్‌టాక్‌’ తరహా ఫీచర్‌ను తీసుకువస్తోంది. ‘టిక్‌టాక్‌’ డ్యూయట్‌ తరహాలో ఇతర వీడియోలతో తమ వీడియోలను రీమిక్స్‌ చేయవచ్చు. గత సంవత్సరమే టిక్‌టాక్‌కు పోటీగా

ఇన్‌స్టా నుంచి రీమిక్స్‌ ఫర్‌ రీల్స్‌

ఫోటోషేరింగ్‌ యాప్‌ ‘ఇన్‌స్టాగ్రామ్‌’‘రీమిక్స్‌ ఫర్‌ రీల్స్‌’ పేరిట ‘టిక్‌టాక్‌’ తరహా ఫీచర్‌ను తీసుకువస్తోంది. ‘టిక్‌టాక్‌’ డ్యూయట్‌ తరహాలో ఇతర వీడియోలతో తమ వీడియోలను రీమిక్స్‌ చేయవచ్చు. గత సంవత్సరమే టిక్‌టాక్‌కు పోటీగా ‘రీల్స్‌’ ఇన్‌స్టాగ్రామ్‌ తీసుకువచ్చిన విషయం తెలిసిందే. 


 గత ఏడాది అక్టోబర్‌ నుంచి ఎంపిక చేసిన కొంతమంది ద్వారా దీనిని టెస్టింగ్‌ చేస్తున్నారు. త్వరలో ఇది ప్రపంచ వ్యాప్తంగా ‘రీల్‌’ యూజర్లు అందరికీ అందుబాటులోకి రానుంది.  పాత యూజర్లకు ఈఫీచర్‌  డీఫాల్ట్‌గా రాకుంటే దీనిని మాన్యువల్‌గా ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. ‘రీల్‌’కు చెందిన మూడు చుక్కల మెనూలోకి వెళ్ళి ‘ఎనేబుల్‌ మిక్సింగ్‌’ను ఎంపిక చేసుకోవాలి. అంతే, స్ర్కీన్‌కు ఎడమపక్క ప్రత్యక్షమవుతుంది. ఇదంతా చాల సులువైన వ్యవహారం. వద్దనుకుంటే దీన్ని డిజేబుల్‌ చేసుకోవచ్చు. ఐఔస్‌, ఆండ్రాయిడ్‌ వినియోదారులందరికీ ఈ కొత్త ఫీచర్‌ అందుబాటులోకి వస్తోంది. 


Updated Date - 2021-04-03T05:56:00+05:30 IST