కంభం జూనియర్‌ కళాశాల వద్ద ఆక్రమణల తొలగింపు

ABN , First Publish Date - 2021-12-06T05:24:35+05:30 IST

కంభం ప్రభుత్వ జూనియర్‌, ఉన్నత పాఠశాల రక్షణ గోడ వెం ట ఏర్పాటు చేసుకున్న బంకులను తొలగించుటకు కొంత సమయం ఇవ్వాలని కోరుతూ బాధితులు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన కు దిగారు.

కంభం జూనియర్‌ కళాశాల వద్ద ఆక్రమణల తొలగింపు
నిరసన తెలుపుతున్న బాధితులు


గడువు కోరుతూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన

కంభం, డిసెంబరు 5 : కంభం ప్రభుత్వ జూనియర్‌, ఉన్నత పాఠశాల రక్షణ గోడ వెం ట ఏర్పాటు చేసుకున్న బంకులను తొలగించుటకు కొంత సమయం ఇవ్వాలని కోరుతూ బాధితులు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన కు దిగారు. అనంతరం కందులాపురం సర్పంచ్‌ రజనికి వినతిపత్రం అందచేశారు. వివరాల్లోకి వెళితే కంభం మండలం కందులాపురం పంచాయతీ పరిధిలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జూనియర్‌ కళాశాల, డిగ్రీ కళాశాలల కాం పౌండ్‌ వాల్‌ వెంట పలువురు చిరువ్యాపారు లు కొన్ని సంవత్సరాలుగా బంకులను పెట్టుకు ని జీవనం సాగిస్తున్నారు. ఈ ఆక్రమణ వలన రోడ్డు ఇరుకుగా మారడమేకాక బంకుల చా టున మలమూత్రాలు విసర్జించడం, పలువురు మద్యం సేవించడం, కళాశాల గేటు సమీపం లో జంతువులను వధించి విక్రయాలు చేస్తున్నారు. దీంతో కళాశాల గోడ వెంట ఉన్న బంకులను తొలగించాలని ఓ అడ్వకేట్‌ గిద్దలూరు కోర్టులో పిటిషన్‌ వేయడం జరిగింది. స్పందించిన న్యాయమూర్తి శనివారం గిద్దలూరులో జరిగిన లోక్‌అదాలత్‌కు కంభం ఆర్‌ అండ్‌ బీ డీఈని, ఎంపీడీవోను, కార్యదర్శి బ్రహ్మయ్యను బంకులను వెంటనే తొలగించాలని ఆదేశించారు. స్పందించిన కార్యదర్శి బ్రహ్మయ్య ఆదివారం ఉదయం పంచాయతీ సిబ్బందితో వచ్చి కళాశాల గోడ వెంట పెట్టుకున్న బంకులను తొలగించారు. దీంతో బాధితులు కోర్టు ఇచ్చిన తీర్పును తాము గౌరవిస్తామని, ముం దస్తు సమాచారం ఇవ్వకుండా బంకులను తొలగించడం అన్యాయమన్నారు. సంవత్సరాల నుంచి తాము బంకుల మీద జీవిస్తున్నామన్నారు. కరోనా వలన పనులు లేక దుర్భర జీవితాలను గడుపుతున్నామని, లాయర్‌ మా మీద చేసిన ఆరోపణలన్నీ అసత్యమని తెలిపారు. మాపై దయవుంచి బంకులు తొలగించు కునేందుకు కొంత సమయం ఇవ్వాలని, తిరిగి బంకులు పెట్టుకునేందుకు పంచాయతీ వారు స్థలాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ ఆందోళనలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-12-06T05:24:35+05:30 IST