Advertisement

అభివృద్ధి చేయడానికే ఆక్రమణల తొలగింపు

Mar 6 2021 @ 23:43PM

రూ.5కోట్లతో వాణిజ్యసముదాయాల నిర్మాణం : మున్సిపల్‌ కమిషనర్‌ పాటిల్‌

ఖిల్లా, మార్చి 6 : జిల్లా కేంద్రంలోని అహ్మదీబజార్‌లో అభివృద్ధి పనులు చేయడానికే మేకల సంతలో ఉన్న ఆక్ర మణలను తొలగించినట్టు మున్సిపల్‌ కమిషనర్‌ జితేష్‌ వి పాటిల్‌ తెలిపారు. శనివారం ఉదయం నిజామాబాద్‌ ఏసీ పీ శ్రీనివాస్‌కుమార్‌ నేతృత్వంలో భారీ పోలీసు బందోబస్తు మధ్య ఆక్రమణలను తొలగించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వృఽథాగా ఉన్న మేకల సంత స్థలంలో వాణిజ్య సముదాయ భవనాన్ని నిర్మించనున్నట్లు చెప్పారు. అం దుకు జనరల్‌ ఫండ్‌ నిధుల నుంచి రూ.5కోట్లు వెచ్చించనున్నట్లు తెలిపారు. వీటి నిర్మాణానికి కాంట్రాక్టర్‌కు పను లు అప్పగించామన్నారు. సోమవారం వరకు మిగతా వ్యా పారులు తమ దుకాణాలను ఖాళీ చేయాలని ఆదేశించా రు. లేని పక్షంలో తామే వాటిని తొలగిస్తామన్నారు. 

అడ్డుకున్న బీజేపీ కార్యకర్తల అరెస్ట్‌

 ఆక్రమణలను తొలగిస్తున్న సమాచారాన్ని తెలుసుకు న్న కొందరు బీజేపీ కార్పొరేటర్లు, కార్యకర్తలు అక్కడికి చేరు కున్నారు. ఆక్రమణలు తొలగించకుండా అడ్డుకున్నారు. దీం తో వారిని పోలీసులు అరెస్ట్‌ చేసి పోలీసు స్టేషన్‌కు తరలి ంచారు. ఇదిలా ఉండగా జిల్లా కేంద్రంలోని నడిబొడ్డున గ ల అహ్మదీబజార్‌లో నిజాంకాలం నాటి నుంచి (1935 సంవత్సరం మొదలు) ఇక్కడ మేకల సంత జరుగుతోంది. నగ రం అభివృద్ధి చెందడంతో కొందరు స్థానిక వ్యక్తులు ఇక్కడి స్థలంపై కన్నేశారు. అక్రమంగా దుకాణాల సముదాయాల ను ఏర్పాటు చేసి వివిధ వ్యాపారులకు అద్దెకు ఇచ్చారు. దీ ంతో అప్పటి నుంచి ఈ స్థలం వారి కబ్జాలోనే కొనసాగుతో ంది. అప్పటి నుంచి మున్సిపల్‌కు ఎటువంటి ఆదాయం స మకూర లేదు. అయితే ఇటీవల అక్కడి స్థలాన్ని మున్సిప ల్‌ అధికారులు కబ్జా చేసుకుని వ్యాపారసముదాయాన్ని ని ర్మిస్తే మున్సిపల్‌కు ఆదాయం వస్తుందని భావించారు. ఈ విషయంపై దృష్టి సారించిన అధికారులు ఏళ్ల తరబడి క బ్జాలో ఉన్న స్థలాన్ని ఆక్రమించుకున్నారు. గతంలో మున్సిపల్‌ శాఖాధికారులు ఇక్కడి వ్యాపారుల వద్ద నుంచి అక్ర మంగా వసూళ్లకు పాల్పడడం వల్ల వారిని ఉన్నతాధికారు లు విధుల్లో నుంచి తొలగించినట్లు సమాచారం. 

Follow Us on:
Advertisement