కలెక్టరేట్‌ ఆవరణ లో పాత భవనాల తొలగింపు

ABN , First Publish Date - 2022-07-05T05:09:01+05:30 IST

కలెక్టరే ట్‌ ఆవరణలో శిథిలావస్థకు చేరుకుని కూలేం దుకు సిద్ధంగా ఉన్న భవనాలను తక్షణమే తొల గించాలని ఎక్సైజ్‌ శాఖ మంత్రి వి శ్రీనివాస్‌గౌడ్‌ అధికారులకు సూచించారు.

కలెక్టరేట్‌ ఆవరణ లో పాత భవనాల తొలగింపు
పాత భవనాలను కలెక్టర్‌తో కలిసి పరిశీలిస్తున్న మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

-  ఉస్మానియా, నీలోఫర్‌ ఆస్పత్రులకు

      వెళ్లకుండా ఇక్కడే సూపర్‌స్పెషాలిటీ

-   ఎక్సైజ్‌ శాఖ మంత్రి  శ్రీనివాస్‌గౌడ్‌

-  అధికారులతో కలిసి పాతభవనాల పరిశీలన

మహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌, జూలై4:  కలెక్టరే ట్‌ ఆవరణలో శిథిలావస్థకు చేరుకుని కూలేం దుకు సిద్ధంగా ఉన్న భవనాలను తక్షణమే తొల గించాలని ఎక్సైజ్‌ శాఖ మంత్రి వి శ్రీనివాస్‌గౌడ్‌ అధికారులకు సూచించారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున  పాతభవనాల్లో ఉండటం ప్ర మాదకరమని వర్షానికి నాని కూలితే భారీ మూ ల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు.   సోమ వారం కలెక్టర్‌ ఎస్‌వెంకట్రావ్‌, అధికారులతో కలి సి మంత్రి కలెక్టరేట్‌ ఆవరణలో ఉన్న పాత భ వనాలను పరిశీలించారు. డీఆర్‌డీవో భవనం పె చ్చులూడి పిల్లర్లు తేలి ఉన్నందున ప్రమాద క రంగా ఉందని, తక్షణమే వారంరోజుల్లో కూల్చి వేత పనులు చేపట్టాలని సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించే కాంట్రాక్టర్‌లకు సూచించా రు. ఆర్‌అండ్‌బీ అధికారులు కూడా ఈ భవనం సరిగా లేదని  నివేదిక ఇచ్చారని, తక్షణమే భవ నాన్ని అధికారులు ఖాళీ చేయాలన్నారు. పాత కలెక్టరేట్‌ భవనం స్థానంలో రూ.400 కోట్లతో సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించనున్నా మని వెల్లడించారు. ఇందుకు ముఖ్యమంత్రి కేసీ ఆర్‌ అంగీకరించారని ఆయనకు జిల్లా ప్రజల త రపున కృతజ్ఞతలు తెలిపారు.  ఇదివరకు వైద్యం కోసం ఉస్మానియా, గాంధీ, నిమ్స్‌, నీ లోఫర్‌ ఆ స్పత్రులకు వెళ్లాల్సి వచ్చేదని సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మిస్తే ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే నా ణ్యమైన వైద్యం అందుతుందని, మనవద్దకే  చు ట్టుపక్కల జిల్లాల ప్రజలు వచ్చే పరిస్థితి వస్తుం దని వివరించారు. ఆసుపత్రి ముందు అధునా తన షాపింగ్‌ కాంప్లెక్స్‌, టూరిజం హబ్‌ను ఏ ర్పాటు చేస్తామని మంత్రి పేర్కొన్నారు. కార్యక్ర మంలో అదనపు కలెక్టర్లు  తేజస్‌నందలాల్‌ ప వార్‌, సీతారామారావు, ఆర్డీవో అనిల్‌కుమార్‌, మునిసిపల్‌ చైర్మన్‌ కోరమోని నర్సింహులు, అర్బన్‌ తహసీల్దార్‌ పార్థసారఽథి పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-05T05:09:01+05:30 IST