జిల్లా ఆస్పత్రి ప్రాంగణంలో ప్రైవేటు అంబులెన్స్‌ల తొలగింపు

ABN , First Publish Date - 2021-06-20T05:32:42+05:30 IST

సంగారెడ్డి జిల్లా ఆస్పత్రి ప్రాంగణం నుంచి ప్రైవేటు అంబులెన్స్‌లను తొలగించారు.

జిల్లా ఆస్పత్రి ప్రాంగణంలో ప్రైవేటు అంబులెన్స్‌ల తొలగింపు
ప్రైవేటు అంబులెన్స్‌లను అనుమతించకపోవడంతో ఖాళీగాఉన్న ఆస్పత్రి ఆవరణ

సంగారెడ్డి అర్బన్‌, జూన్‌ 19 : సంగారెడ్డి జిల్లా ఆస్పత్రి ప్రాంగణం నుంచి ప్రైవేటు అంబులెన్స్‌లను తొలగించారు. ఈ నెల 18న ’అందరూ ఒక్కటై దోపిడీ‘ అనే శీర్షికన ’ఆంధ్రజ్యోతి‘లో ప్రచురితమైన కఽథనానికి ఆస్పత్రి అధికారు లు స్పందించారు. ఆస్పత్రి ప్రాంగణంలో ప్రైవేటు అంబులెన్సులు, ఇతర బయ టి వ్యక్తుల వాహనాలు నిలిపి ఉంచకుండా చూడాలని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కె.సంగారెడ్డి ..సెక్యూరిటి, ఆస్పత్రి సిబ్బందికి సూచించారు. మార్చురీలో ప్రైవేటు వ్యక్తుల ఫ్రీజర్లకు అనుమతి లేదంటూ హెచ్చరించారు. నిబంధనల ప్రకారం అంబులెన్స్‌ చార్జీలు వసూలు చేయాలని లేకపోతే చర్యలు తప్పవని సర్కారు అంబులెన్స్‌ సిబ్బందికి సూచించినట్లు తెలిసింది. 

Updated Date - 2021-06-20T05:32:42+05:30 IST