తొలగించిన గేట్ సామాగ్రిని ట్రాక్టర్‌లోకి తరలిస్తున్న సిబ్బంది
యాదగిరిగుట్ట రూరల్, జూలై 6: పట్టణ పరిధిలోని తొమ్మిదో వార్డులోని పుణ్యభూమి వెంచర్ నిర్వాహకులు స్థానిక వైకుంఠధామానికి(శ్మశానవాటిక)కు వెళ్లకుండా దారికి గేట్ నిర్మించి, తాళం వేయడంతో గేట్‌ను తొలగించినట్లు టౌన్‌ఫ్లానింగ్ అధికారి కృష్ణవేణి తెలిపారు. బుధవారం ఆమె స్థానిక విలేకరులతో మాట్లాడుతూ వెంచర్ పక్కన వైకుంఠధామం ఉండటంతో అక్కడి ప్రజలు అంతిమ సంస్కారం చేయడానికి వెళ్లేకుండా గేట్ వేస్తున్నారని ఆ వార్డు కౌన్సిలర్ దండెబోయిన అనిల్, స్థానిక ప్రజలు ఈ నెల 25న ఫిర్యాదు చేశారని తెలిపారు. 15 రోజుల క్రితం వెంచర్ యజమానికి నోటీసులు ఇచ్చినప్పటికీ స్పందించ లేదన్నారు. దీంతో వైకుంఠ ధామం వెళ్లడానికి దారి తప్పకుండ అవసరమని తమ సిబ్బంది ద్వార గేట్లను తొలగించి, స్వాధీనం చేసుకున్నామని ఆమె తెలిపారు.