మట్టి నిల్వల కోసం చెట్ల తొలగింపు

ABN , First Publish Date - 2021-07-24T05:07:11+05:30 IST

మట్టి నిల్వల కోసం పులివెందుల ఏరియా ఆస్పత్రి ఆవరణలోని చెట్లు తొలగిస్తున్నారు.

మట్టి నిల్వల కోసం చెట్ల తొలగింపు
ఆస్పత్రి ఆవరణలో తొలగించిన పచ్చని చెట్లు

పులివెందుల రూరల్‌, జూలై 23: మట్టి నిల్వల కోసం పులివెందుల ఏరియా ఆస్పత్రి ఆవరణలోని చెట్లు తొలగిస్తున్నారు. దాదాపు 11 ఏళ్లగా వేప, నేరేడు, జువ్వి, కానుగ తదితర చెట్లు ఆస్పత్రి ఆవరణలో ఉండేవి. రోగులకు ఆహ్లాదాన్ని పంచుతూ, సహాయకులకు నీడను సమకూర్చేవి. పులివెందుల ఏరియా ఆస్పత్రి నూతన భవన నిర్మాణా లు చేపట్టే పనుల్లో భాగంగా కాంట్రాక్టర్‌ ఎక్స్‌కవేటర్లతో తోడుతున్న  మట్టిని ఆస్పత్రి ఆవరణలోని చెట్లను తొలగించి అక్కడే డంప్‌ చేస్తు న్నారు. చెట్ల తొలగింపు విషయమై సూపరింటెండెంట్‌ మధుసూదన్‌ రెడ్డిని వివరణ కోరగా చెట్లను తొలగించేందుకు తనవద్ద అనుమతి తీసుకోలేదన్నారు. విషయం తెలిసిన వెంటనే తాను కాంట్రాక్టర్‌కు ఫోన్‌ చేశానని అయితే ఆయన అందుబాటులో లేరని తెలిపారు.



Updated Date - 2021-07-24T05:07:11+05:30 IST