శరీరంలోని విషాల్ని ఇలా హరిద్దాం..

ABN , First Publish Date - 2022-03-08T18:26:31+05:30 IST

మన శరీరం ప్రతి రోజూ పలు రకాల విషాలను శోషించుకుంటూ ఉంటుంది. పర్యావరణంలోని కలుషితాలు, ఆహారంలోని కృత్రిమ పోషకాల రూపంలో ఎన్నో

శరీరంలోని విషాల్ని ఇలా హరిద్దాం..

ఆంధ్రజ్యోతి(08-03-2022)

మన శరీరం ప్రతి రోజూ పలు రకాల విషాలను శోషించుకుంటూ ఉంటుంది. పర్యావరణంలోని కలుషితాలు, ఆహారంలోని కృత్రిమ పోషకాల రూపంలో ఎన్నో టాక్సిన్లు శరీరంలో చేరుకుంటూ ఉంటాయి. వీటిని మన కాలేయం శక్తి మేరకు విరిచేస్తూ ఉన్నప్పటికీ, అందుకు మన వంతు తోడ్పాటు అందిస్తూ ఉండడం అవసరం. అకారణమైన అలసట, తిరగబెట్టే అలర్జీలు, దురదలు, కడుపు ఉబ్బరం, బ్రెయిన్‌ ఫాగ్‌ మొదలైన సమస్యలు శరీరంలో టాక్సిన్లు పెరిగిపోయాయి అనడానికి సంకేతాలు. ఇలాంటప్పుడు ఆ విషాలను హరించే చర్యలు చేపట్టాలి. అవేంటంటే...


నీరు: రోజుకు కనీసం 8 గ్లాసుల నీళ్లు తాగాలి.

ఆహారం: వేపుళ్లు, అధిక కొవ్వులు, పాలిష్‌ పట్టిన పదార్థాలను తగ్గించాలి.

చక్కెర: కృత్రిమ చక్కెరలకు బదులుగా తేనె వాడుకోవాలి.

పండ్లు: ప్రతి రోజూ కూరగాయలు, పండ్లు తినాలి. 

ధాన్యాలు: పాలిష్‌ పట్టిన ధాన్యాలకు బదులుగా బ్రౌన్‌ రైస్‌, ఓట్లు వాడుకోవాలి.

మాంసకృత్తులు: మాంసం, చేపలు, గుడ్లు, పుట్టగొడుగులు, అవకాడో తరచుగా తింటూ ఉండాలి. 

ఉప్పు: సాధారణ ఉప్పుకు బదులుగా రాతి ఉప్పు వాడుకోవాలి. 

కాలేయం: కాలేయం భేషుగ్గా పని చేయడం కోసం వెల్లుల్లి, బీట్‌రూట్‌, బ్రొకొలి తినాలి.

గ్రీన్‌ టీ: దీన్లోని శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని విషాలను హరిస్తాయి. 

నిద్ర: ఏడు గంటలకు తగ్గకుండా నిద్రపోవాలి. 

ధ్యానం: ధ్యానంతో ఒత్తిడి, ఆందోళనలను తగ్గించుకోవాలి.

Updated Date - 2022-03-08T18:26:31+05:30 IST