వైద్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్‌ పేరు తొలగించడం దుర్మార్గం

ABN , First Publish Date - 2022-09-23T05:11:55+05:30 IST

విజయవాడలోని డాక్ట ర్‌ ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్శిటీకి ఎన్టీఆర్‌ పేరు తొల గించి వైఎస్‌ఆర్‌ పేరు పెట్టడం దుర్మార్గమైన చర్య అ ని టీడీపీ మండల అధ్యక్షుడు పొద వీరయ్య అన్నారు.

వైద్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్‌ పేరు తొలగించడం దుర్మార్గం
చినగంజాంలో నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్న టీడీపీ నేతలు

చినగంజాం, సెప్టెంబరు 22: విజయవాడలోని డాక్ట ర్‌ ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్శిటీకి ఎన్టీఆర్‌ పేరు తొల గించి వైఎస్‌ఆర్‌  పేరు పెట్టడం దుర్మార్గమైన  చర్య అ ని టీడీపీ మండల అధ్యక్షుడు పొద వీరయ్య అన్నారు. స్థానిక అంబేడ్కర్‌ సెంటర్‌లో గురువారం రాత్రి నా యకులు, కార్యకర్తలు నల్ల బ్యాడ్జీలు ధరించి అంబేడ్క ర్‌ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆదేశాల మేరకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు గ్రామంలోని ప్రధాన రహదారుల గుండా సోపిరాల రైల్వేగేటు సెం టర్‌ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. తదనంత రం సోపిరాల రైల్వే గేటు సెంటర్‌లో మానవహారం చేసి వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేసి, ఎన్టీఆర్‌ పేరు మారుస్తూ వైఎస్సార్‌ పేరుతో ఇచ్చిన జీవో ప్రతులను దహనం చేశారు. కా ర్యక్రమంలో టీడీపీ నాయకులు చెరుకూరి రాఘవ య్య, అజాద్‌, అసోది సుబ్బారెడ్డి, టి.జయరావు, రాయ ని ఆత్మారావు, సందు శ్రీనివాసరావు, వి.వెంకయ్య, నా గరాజు, నారాయణ, రామాంజనేయులు, పద్మావతి, న రహరి శ్రీనివాసరావు, ఎం.రామసుబ్బారావు, ఎస్‌.సుబ్ర మణ్యం, కె.విష్ణు, బి.సతీష్‌, ఉదయభాస్కర్‌రెడ్డి, వి.ఏ డుకొండలు గోపాలం, బాలరాజు, కార్యకర్తలు పాల్గొన్నారు. 


 వైపీపీ కపట నాటకానికి నిలువెత్తు నిదర్శనం

అద్దంకిటౌన్‌, సెప్టెంబరు 22: ఎన్‌టీఆర్‌ వైద్య విశ్వవిద్యాల యానికి ఆయన పేరు తొలగించి వైఎస్‌ఆర్‌ పేరు పెట్టడం వైసీపీ కపట నాటకానికి, జగన్‌మోహన్‌ రెడ్డి కపట ప్రేమకు నిలువెత్తు నిదర్శమని టీడీపీ బాపట్ల జిల్లా లీగల్‌ సెల్‌ అధ్యక్షుడు, న్యాయవాది బత్తుల రామకోట య్య విమర్శించారు. వైద్య కళాశాలలు అన్నింటిని ఒ కే గోడుగు కిందకు తెచ్చి భారతదేశంలోనే మొట్టమొ దట ఆరోగ్య విశ్వ విద్యాలయం నెలకొల్పిన వ్యక్తి ఎన్టీ ఆర్‌ అని అన్నారు.  

Updated Date - 2022-09-23T05:11:55+05:30 IST