మల్లన్న ఆలయంలో మా సేవలను పునరుద్ధరించండి

ABN , First Publish Date - 2022-01-23T04:45:32+05:30 IST

సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయంలో చౌదరి సర్వీ్‌సదార్‌, యాదవ స్థానాచార్యుల సేవలను పునరుద్ధరింపచే యాలని కోరుతూ చౌదరి కుటుంబీకులు తెలంగాణ రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయశాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌కు శనివారం వినతిపత్రాన్ని అందజేశారు.

మల్లన్న ఆలయంలో మా సేవలను పునరుద్ధరించండి

  దేవాదాయశాఖ కమిషనర్‌కు చౌదరి కుటుంబీకుల విజ్ఞప్తి


చేర్యాల, జనవరి 22: సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయంలో చౌదరి సర్వీ్‌సదార్‌, యాదవ స్థానాచార్యుల సేవలను పునరుద్ధరింపచే యాలని కోరుతూ చౌదరి కుటుంబీకులు తెలంగాణ రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయశాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌కు శనివారం వినతిపత్రాన్ని అందజేశారు. మల్లన్న ఆలయంలో తమ పూర్వీకులు ఒగ్గుపూజారులచే పట్నం వేయించడం, బోనం నివేదించడం చేయించడం వంటి ఆనవాయితీ 200ఏళ్లుగా కొనసాగుతోందని మల్లన్న ఆలయ మాజీ యాదవస్థానాచార్యుడు ముద్దం బాలయ్య తనయుడు ముద్దం విజయ్‌కుమార్‌ కమిషనర్‌కు తెలిపారు. నిజాంకాలంలో తమ పూర్వీకురాలు ముద్దం మల్లమ్మ పట్నం టికెట్లు ప్రవేశపెట్టి, వచ్చిన ఆదాయంతో ఆలయాభివృద్ధికి చర్యలు తీసుకున్నారని గుర్తుచేశారు. ఆమె అనంతరం తన తండ్రి బాలయ్యచౌదరి కొనసాగగా, 1948లో ఆలయాన్ని గవర్నమెంట్‌ ఆఫ్‌ దక్కన్‌, నల్లగొండ వారికి అప్పగించారని విజయ్‌ పేర్కొన్నారు. ‘‘పట్నాలు, బోనాల టికెట్లలో 1/3వంతు ఆదాయం ప్రతిఫలంగా మాకు అందించేవారు. అందులోనుంచి ఒగ్గుపూజారులకు సగంవాటా చెల్లించేవాళ్లం. యేటా స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా కళ్యాణం సందర్భంగా మా ఇంటి నుంచే తలంబ్రాలు అందించేవాళ్లం. మొదటి వారం(పట్నంవారం) సందర్భంగా హైదరాబాద్‌కు చెందిన మానుక పోచయ్య కుటుంబానికి పెద్దపట్నం, అగ్నిగుండాలు వేసే హక్కు కల్పించారు. మహాశివరాత్రి, శ్రీకృష్ణజన్మాష్టమి తదితర వేడుకలలో ఉత్సవ విగ్రహాలను ఒగ్గుపూజారులు, అర్చకుల దండకాలన నడుమ మేమే తీసుకువచ్చి పెద్దపట్నంపై నెలకొల్పి కళ్యాణం జరిపేవాళ్లం. అగ్నిగుండాల కార్యక్రమంలో మొదటగా బాలయ్య చౌదరి నడిచిన తర్వాతే భక్తులు నడిచేవారు. మా కుటుంబీకులు నియమనిష్టలతో సాంప్రదాయం ప్రకారం వేడుకలను నిర్వహింపచేశారు. బాలయ్య మరణానంత రం మా కుటుంబీకులు సేవలను కొనసాగించారు. చౌదరి సేవల వారసత్వ నిర్వహణకు అవకాశం కల్పించాలని పలుమార్లు విన్నవించుకున్నాం. మా వాటా ప్రతిఫలాన్ని కూడా ఒగ్గుపూజారులకు చెల్లిస్తున్నారు. ఉపాధి లేక మేము దుర్భరజీవితాలు గడుపుతున్నాం. గతంలో మాదిరిగా మేము యాదవ స్థానాచార్యులు, చౌదరీ సర్వీ్‌సదార్‌ సేవలు నిర్వహించేందుకు సంసిద్ధంగా ఉన్నాం’’ అని విజయ్‌ కుమార్‌ కమిషనర్‌కు తెలిపారు. ఈ విషయమై అనిల్‌ కుమార్‌ హామీ ఇచ్చారని ఆయన తదనంతరం విలేకరులకు వెల్లడించారు. 


 

Updated Date - 2022-01-23T04:45:32+05:30 IST