Advertisement

అద్దెల దరువు

Mar 1 2021 @ 23:15PM
ప్రైవేటు స్థలాల్లో వేసుకున్న టెంట్లు వ్యూ (ఫైల్‌)

జములమ్మకు నైవేద్యం పెట్టాలంటే అద్దె చెల్లించాల్సిందే

ప్రయివేటు ఖాళీ స్థలాలకూ అద్దె వసూలు

టెంట్‌హౌజ్‌కు గద్వాలలో కంటే అధిక రేట్లు

భక్తుల జేబులకు చిల్లులు పెడుతున్న వ్యాపారులు

గద్వాల రూరల్‌, మార్చి 1: జోగులాంబ గద్వాల జిల్లాలో పేరొందిన గ్రామ దేవత జములమ్మ దేవస్థానంలో ఆలయం లోపల, బయట భక్తు ల నిలువు దోపిడీ జరుగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ప్రతి ఏటా మాఘశుద్ద్య పౌర్ణమి నుంచి దాదాపు ఆరు నెలలపాటు జములమ్మ జాతర జరుగుతుంది. అమ్మవారిని కొలిచేందుకు కర్ణాటక, మహారాష్ట్రలతోపాటు స్థానికంగా భక్తులు తరలి వస్తారు. ప్రతి మంగళ, శుక్రవారాలలో నైవేద్యా లను సమర్పిస్తారు. మొదటి, రెండు మంగళవారాలు 60 వేల నుంచి 70 వేల భక్తుల వరకు దర్శించుకుంటారు. ఆ తర్వాత ప్రతి వారం 10వేల నుంచి 20వేల మంది భక్తులు వస్తారు. ఇలా దాదాపు ఐదు నెలలు భక్తులు వస్తారు. ఇంతటి మహాత్యం కలిగిన దేవస్థానంలో భ క్తులను దోపిడి చేస్తే అడిగే వారు కరువ య్యారు. 


టెంట్‌హౌజ్‌, ప్రయివేటువారి దోపిడీ ఇలా..

జములమ్మ దేవస్థానంలో భక్తుల నైవేద్యం పెట్టడా నికి స్థలం కరువైంది. దీంతో అక్కడ ఖాళీగా ఉండే ప్రయివేటు స్థలాలలో షామియానాలు వేసుకొని కొలి చేవారు. అయితే ఈ మధ్య కాలంలో టెంట్‌ హౌజ్‌ వారు సిండికేటుగా మారి ప్రయివేటు స్థలాలను (దాదాపు 50 ఎకరాలను) వారి ఆధీనంలోకి తెచ్చుకున్నా రు. ఎవరైన టెంటు వేయాలంటే అక్కడ ఉన్న టెంట్‌ హౌజ్‌వారి దగ్గరే తీసుకోవాలి. టెంట్‌కు గిన్నెలు, సామగ్రి, డ్రమ్ములతో పాటు స్థలానికి అద్దె చెల్లించాలి. ఒక 18ఇంటు36టెంట్‌ వేస్తే రూ.2000 వేలు వసూలు చేస్తున్నారు. డ్రమ్ముకు నీళ్లతోపాటు రూ.100 వసూలు చేస్తారు. కేజి గిన్నెకు రూ.8 బకెట్‌ కు రూ.50, జగ్గుకు రూ.50 బేసిన్‌కు రూ.50 ఇలా ఒక భక్తుడు అమ్మవారికి నైవేద్యం పెట్టాలంటే వీరి అద్దెనే దాదాపు రూ.8 వేలు దాటిపోతుంది. గతంలో స్థలం ఫ్రీగా దొరికేది. ఇప్పుడు ఎక్కడ వేసిన అద్దె కట్టాల్సిన పరిస్థితి. సిండికేట్‌గా మారి రేట్లు అధికం చేశారు. ఇలా ఉండగా మంచి నీటి దోపిడీ మరోలా ఉంది. ఫిల్టర్‌ నీళ్లంటూ ఒక్కో డబ్బా రూ.20 అమ్ముతున్నారు. కూల్‌ వాటర్‌ రూ.60 అమ్ముతున్నారు. 


ఆలయంనూ దోపిడే..

లడ్డూ ప్రసాదం తక్కువ సైజుతో అమ్ముతున్నారు. పులి హోర రుచికరంగా లేదని భక్తులే అంటున్నారు. ఇక టెంకాయలు కొట్టే దగ్గర లాక్కొని కొట్టి రూ.10 నుంచి రూ.20 వరకు వసూళ్లు చేస్తున్నారు. ఆలయం లోపల జరుగుతున్న తంతు ఇది. ఇలా ఆలయం బయట, లోపల భక్తుల జేబులకు చిల్లులు పడుతూనే ఉంది. సెంటిమెంటు కలిగిన భక్తులు మౌనంగానే భరిస్తున్నారు. బయట వ్యాపారుల ఇష్టారాజ్యాన్ని పోలీసులే నివారించాలని ఆలయ అధికారులు అనడం కొసమెరుపు.


Follow Us on:
Advertisement