కొన్ని అందమైన ఫొటోలను తప్పకుండా షేర్ చేయాలంటూ పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ ఓ అరుదైన ఫొటోను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. నిద్రపోతున్న ఆద్య, అకీరాను పవన్ ఆప్యాయంగా హత్తుకున్నారు. ఆ అరుదైన సందర్భాన్ని రేణు కెమెరాలో బంధించారు.
ఆ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. `కొన్ని అందమైన ఫొటోలను షేర్ చేయాలి. అవి మీ ఫోన్ ఫొటో ఆల్బమ్‌లో ఉండలేవు. నా ఫోన్ కెమెరాలో నేను బంధించిన కొన్ని అరుదైన క్షణాలు` అంటూ రేణు కామెంట్ చేశారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.