రేణుకా ఎల్లమ్మ ఆలయ అభివృద్ధికి సాయమందిస్తా

ABN , First Publish Date - 2021-03-06T05:41:12+05:30 IST

రేణుకా ఎల్లమ్మ ఆలయ అభివృద్ధికి సాయమందిస్తా

రేణుకా ఎల్లమ్మ ఆలయ అభివృద్ధికి సాయమందిస్తా
రేణుకా ఎల్లమ్మఆలయంలో పూజలు నిర్వహిస్తున్న కర్ణాటక మంత్రి అరవిందలింబావళి దంపతులు

  • కర్ణాటక అటవీ శాఖ, భాషా సంస్కృతి మంత్రి అరవిందలింబావళి


తాండూరు రూరల్‌: తాండూరు మండలం తెలంగాణ-కర్ణాటక సరిహద్దులో వెలిసిన రేణుకా ఎల్లమ్మ ఆలయ అభివృద్ధికి తన వంతు సాయమందిస్తానని కర్ణాటక రాష్ట్ర అటవీ శాఖ, కర్ణాటక కన్నడ భాషా సంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి అరవిందలింబావళి అన్నారు. వికారాబాద్‌ జిల్లా తాండూరు మండలం తెలంగాణ-కర్ణాటక సరిహద్దులో వెలిసిన రేణుకా ఎల్లమ్మ ఆలయాన్ని ఆయన  శుక్రవారం సందర్శించారు. ఇటీవల అటవీశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆయన సతీమణితో ఆలయానికి విచ్చేసి ప్రత్యేకపూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలో ప్రదక్షిణలు నిర్వహించి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణదాత అయిన మంత్రికి దేవాదాయ శాఖ అధికారి నరేందర్‌ ఆలయంలో కొంత ఫ్లోరింగ్‌ పనులు చేయాల్సి ఉందని, వాటికి నిధులు మంజూరు చేయాలని మంత్రిని కోరారు. మంత్రి స్పందిస్తూ నిధులకు సంబంధించి ప్రతిపాదనలు పంపించాలని సూచించారు. అనంతరం ఆలయ అధికారులతో సమీక్షించారు. అదేవిధంగా తాండూరు నుంచి వచ్చిన ఎల్మకన్నె పీఏసీఎస్‌ చైర్మన్‌ ఎస్‌.రవీందర్‌గౌడ్‌తోపాటు బీజేపీ సీనియర్‌ నాయకులు, టీఆర్‌ఎస్‌ నాయకులు మంత్రిని సన్మానించారు. ఈకార్యక్రమంలో దేవాదాయశాఖ ఈవో నరేందర్‌, అర్చకులు అరవింద్‌, సాహు శ్రీలత, ఆంజనేయులు, అమితానంద్‌, మన్మోహన్‌సార్డా పాల్గొన్నారు.

Updated Date - 2021-03-06T05:41:12+05:30 IST