
నల్లమాడ మండలం చౌటకుంటపల్లి-ఎద్దుల వాండ్లపల్లి దారి ఇది. గంగమ్మ గుడి మలుపు వద్ద ఓబుళదేవరచెరువు, హిందూపురం ప్రధాన రహదారిలో ఇలా లోతైన గుంతలు ఏర్పడ్డాయి. మరమ్మతు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు. నవంబరులో కురిసిన భారీ వర్షాలకు ఈ దారి దెబ్బతింది. సిమెంటు లారీలు, ఇతర భారీ వాహనాలు ఈ దారిలో తిరుగుతాయి. దీంతో మలుపు వద్ద పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. మలకవేమల, హిందూపురం వెళ్లే ప్రధాన రహదారి కావడంతో నిత్యం వాహనాల రద్దీ ఉంటుంది. ద్విచక్ర వాహనాలు, ఆటోల్లో వెళ్లేవారు ప్రమాదాలకు గురవుతున్నారు. గుంతల్లో పడి కాళ్లు, చేతులు విరిగిన సంఘటనలు ఉన్నాయి. ఆర్‌అండ్‌బీ అధికారులు స్పందించాల్సిన అవసరం ఉంది. - నల్లమాడ