గొట్టికాడు చెరువుకట్టకు మరమ్మతులు

ABN , First Publish Date - 2022-01-24T03:00:34+05:30 IST

మండలంలోని గొట్టికాడు చెరువుకట్ట నెర్రెలు బారడంతో గ్రామ పంచాయతీ సర్పంచ్‌ వెందోటి సుప్రజ రెడ్డి ఆదివారం మరమ్మతులు చేయించారు.

గొట్టికాడు చెరువుకట్టకు మరమ్మతులు
మరమ్మతులు చేసిన చెరువు కట్ట

బాలాయపల్లి, జనవరి 23 : మండలంలోని గొట్టికాడు చెరువుకట్ట నెర్రెలు బారడంతో గ్రామ పంచాయతీ సర్పంచ్‌ వెందోటి సుప్రజ రెడ్డి ఆదివారం మరమ్మతులు  చేయించారు. ఈ చెరువు కింద సుమారు 500 ఎకరాల్లో వరి సాగులో ఉంది.  ఇటీవల కురిసిన వర్షాలకు ఈ చెరువుకట్ట కుంగి నెర్రెలు బారడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. ఈ విషయాన్ని సంబందిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా మరమ్మతు లకు  ప్రతిపాదనలు పంపామని చెబుతుండడంతో ఆమె చొరవ తీసుకున్నారు. 

Updated Date - 2022-01-24T03:00:34+05:30 IST