మత్యకారుల భరోసాలో అవకతవకలపై విచారణ

ABN , First Publish Date - 2021-06-17T05:22:05+05:30 IST

మత్యకారుల భరోసా పథకంలో అవకతవకలపై అధికారులు రెండు రోజులుగా విచారణ చేపట్టారు.

మత్యకారుల భరోసాలో అవకతవకలపై విచారణ
విచారణ చేస్తున్న మత్స్యశాఖ ఇన్‌చార్జి జేడీ సురేష్‌

245 మందిని విచారించగా 182 మంది అనర్హులు

వెల్లడించిన మత్స్యశాఖ ఇన్‌చార్జి జేడీ 

కొనసాగుతున్న విచారణ


రేపల్లె, జూన్‌ 16: మత్యకారుల భరోసా పథకంలో అవకతవకలపై అధికారులు రెండు రోజులుగా విచారణ చేపట్టారు. బుధవారం నిజాంపట్నంలో విచారణ నిర్వహించారు. ఈ సందర్భంగా మత్స్యశాఖ  ఇన్‌చార్జి జేడీ సురేష్‌ మాట్లాడుతూ ఇప్పటివరకు 245 మందిని విచారించగా 182 మంది ఈ పథకానికి అనర్హులుగా గుర్తించామని తెలిపారు. బుధవారం నిజాంపట్నంలో మత్స్యకార భరోసా అవకతవకలపై విచారణ నిర్వహించారు. విజయవాడ మత్స్యశాఖ కమిషనర్‌ ఆదేశాలమేరకు 524 మందిపై విచారణ చేపట్టామన్నారు. రెండు రోజులుగా నిజాంపట్నం మండలంలోని నక్షత్రనగర్‌, కొత్తపాలెం, గొందిసముద్రం గ్రామాల్లో విచారణ నిర్వహిచామన్నారు. విచారణ పూర్తయిన తర్వాత దీనికి బాధ్యులైన అధికారులపై మత్స్యశాఖ కమిషనర్‌కు నివేదికలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏడీ గాలిదేవుడు, జిల్లా మత్స్యశాఖ సొసైటీ అధ్యక్షుడు కన్నా భూశంకర్‌, బోటు ఓనర్స్‌ అసోసియేషన్‌ అఽధ్యక్షుడు కన్నా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. 

 

 ============

Updated Date - 2021-06-17T05:22:05+05:30 IST