మాతృ భూమి రుణం తీర్చుకోండి

Published: Tue, 29 Mar 2022 03:29:01 ISTfb-iconwhatsapp-icontwitter-icon

  • ప్రజాస్వామిక ఉద్యమానికి కలిసి రండి
  • ప్రవాస భారతీయులకు బండి సంజయ్‌ పిలుపు


హైదరాబాద్‌/సైదాబాద్‌/కందుకూరు, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): గడీల పాలనలో బందీ అయి తెలంగాణ తల్లి రోదిస్తోందని, సీఎం  కేసీఆర్‌ చెర నుంచి విడిపించండంటూ కన్నీళ్లు పెడుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. ‘‘తెలంగాణ తల్లి రుణం తీర్చుకునే సమయం వచ్చింది. తెలంగాణ బిడ్డలుగా మేం చేస్తున్న పోరాటానికి మద్దతు ఇచ్చి ప్రజాస్వామిక, తెలంగాణ పోరాటంలో భాగస్వాములై, మాతృభూమి రుణం తీర్చుకోండి’’ అని అమెరికాలోని ప్రవాసీలకు సంజయ్‌ పిలుపునిచ్చారు. ఏక్‌ దక్కా-తెలంగాణ పక్కా.. అన్న అంశంపై ప్రవాస భారతీయులు సోమవారం జూమ్‌ సమావేశం నిర్వహించారు. అడపా ప్రసాద్‌, కృష్ణారెడ్డి అనుగుల, విలాస్‌ జంబుల ఆధ్వర్యంలో జరిగిన ఈ భేటీలో బీజేపీ విదేశీ వ్యవహారాల శాఖ ఇన్‌చార్జ్‌ విజయ్‌ చౌతైవాలె పాల్గొన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై బీజేపీ చేస్తున్న పోరాటానికి అండగాఉంటామని, ఈ మహోద్యమంలో జైలుపాలై ఇబ్బంది పడుతున్న పార్టీ కార్యకర్తలను ఆదుకుంటామని ప్రవాసీలు హామీ ఇచ్చారు.


ఈ సం దర్భంగా సంజయ్‌ మాట్లాడారు. కేసీఆర్‌ కుటుంబ, అవినీతి, నియంతృత్వ పాలనతో తెలంగాణ అధోగతి పాలవుతోందని విమర్శించారు. కేంద్రం తెలంగాణకు సహకరించడంలేదని దుష్ప్రచారం చేస్తూ కేసీఆర్‌ మరోసారి సెంటిమెంటును రగిల్చే కుట్ర చేస్తున్నారన్నారు. 


కరెంటు దొంగ కేసీఆర్‌..

రైతుల పేరుతో విద్యుత్‌ను అమ్ముకుంటున్న పెద్ద దొంగ సీఎం కేసీఆర్‌ అని సంజయ్‌ మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లా కందుకూరులో టీడీపీ, టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లకు చెందిన సుమారు 100 మంది సోమవారం రాత్రి  ఆయన సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా సంజయ్‌ మాట్లాడారు. డిస్కంలకు ప్రభుత్వం రూ.60 వేల కోట్ల బకాయి ఉందన్నారు. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని, అప్పుడు పాతబస్తీలో బకాయి ఉన్న విద్యుత్‌, ఇంటి పన్నులు, నల్లా బిల్లులను 15 రోజుల్లో వసూలు చేస్తామన్నారు. త్వరలో చేపట్టబోయే పాదయ ూత్ర పాతబస్తీ ఛావునీలోని వినాయక ఆలయం నుంచి ప్రారంభిస్తానని ప్రకటించారు. సోమవారం ఆలయంలో ఉప ఆలయాల విగ్రహ ప్రతిష్ఠ ఉత్సవాల్లో సంజయ్‌ పాల్గొన్నారు. పాతబస్తీలో దేవాలయాల నిర్వహణకు బీజేపీ అండగా నిలుస్తుందని తెలిపారు. 


ఏబీవీపీ అధ్యక్షుడిగా శంకర్‌

ఏబీవీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా శంకర్‌, కార్యదర్శిగా ప్రవీణ్‌రెడ్డి నియామకయ్యారు. సోమవారం ఏబీవీపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో వీరిని నియమించారు. వీరిద్దరూ 2022-23 విద్యా సంవత్సరానికిగాను పదవుల్లో కొనసాగుతారు. ఈ నెల 30, 31న గద్వాలలో జరగబోయే ఏబీవీపీ తెలంగాణ 40వ రాష్ట్ర మహాసభల్లో బాధ్యతలు స్వీకరిస్తారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.