Nov 26 లోపు సాగు చట్టాలు రద్దు చేయకుంటే..: తికాయత్

ABN , First Publish Date - 2021-11-01T21:00:24+05:30 IST

చర్చలు చేశాం, ప్రతిపాదనలు చేశాం. అయినా ప్రభుత్వం సాగు చట్టాల్ని వెనక్కి తీసుకోవడం లేదు. మేం కేంద్ర ప్రభుత్వానికి ఈ నెల 26వ తేదీ వరకు గడువు ఇస్తున్నాం. అప్పటిలోగా మూడు నల్ల చట్టాల్ని వెనక్కి తీసుకుంటే సరే సరి. లేదంటే ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్తాం...

Nov 26 లోపు సాగు చట్టాలు రద్దు చేయకుంటే..: తికాయత్

న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలను రద్దు చేయడానికి కేంద్రానికి రైతు సంఘాలు సమయం ఇచ్చాయి. తామిచ్చిన పరిధిలోపు రద్దు చేయకపోతే ప్రస్తుతం కొనసాగుతోన్న ఆందోళనను మరింత తీవ్ర స్థాయికి తీసుకెళ్తామని వారు హెచ్చరించారు. సోమవారం ఉత్తరప్రదేశ్‌లో రైతు సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో భారతీయ కిసాన్ యూనియన్ అధినేత రాకేశ్ తికాయత్ మాట్లాడుతూ రైతులు ఆందోళన చేపట్టి ఇప్పటికే ఏడాది పూర్తైందని, అయినప్పటికీ కేంద్రం ఈ విషయాన్ని తేల్చకుండా తాత్సారం చేస్తోందని మండిపడ్డారు.


ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘చర్చలు చేశాం, ప్రతిపాదనలు చేశాం. అయినా ప్రభుత్వం సాగు చట్టాల్ని వెనక్కి తీసుకోవడం లేదు. మేం కేంద్ర ప్రభుత్వానికి ఈ నెల 26వ తేదీ వరకు గడువు ఇస్తున్నాం. అప్పటిలోగా మూడు నల్ల చట్టాల్ని వెనక్కి తీసుకుంటే సరే సరి. లేదంటే ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్తాం. గతంలో కూడా అనేకసార్లు కేంద్రానికి అవకాశం ఇచ్చాం. కానీ కేంద్రం మా ప్రతిపాదనలు ఏవీ పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ మెడలు వంచే వరకు మా పోరాటం ఆగదు’’ అని హెచ్చరించారు.

Updated Date - 2021-11-01T21:00:24+05:30 IST