యాపిల్‌ బ్యాటరీకీ రీప్లేస్‌మెంట్‌!

ABN , First Publish Date - 2021-05-01T05:30:00+05:30 IST

యాపిల్‌ ఐ ఫోన్‌ బ్యాటరీ వీక్‌ అవుతుంది. దాన్నీ ఉచితంగానూ మార్చుకోవచ్చు. అయితే దేనికైనా ఓ పద్ధతి ఉంటుంది. అవేంటో తెలుసుకుని ముందు పాటిస్తే, అసలు బ్యాటరీని ఉచితంగా

యాపిల్‌ బ్యాటరీకీ రీప్లేస్‌మెంట్‌!

యాపిల్‌ ఐ ఫోన్‌ బ్యాటరీ వీక్‌ అవుతుంది.  దాన్నీ ఉచితంగానూ మార్చుకోవచ్చు. అయితే దేనికైనా ఓ పద్ధతి ఉంటుంది. అవేంటో తెలుసుకుని ముందు పాటిస్తే, అసలు బ్యాటరీని ఉచితంగా మార్చుకోగలరా లేదా అన్నది యాపిల్‌ తేలుస్తుంది. ఫలితాన్ని అనుసరించి యాపిల్‌ స్టోర్‌ లేదంటే అథరైజ్‌డ్‌ సెంటర్‌ నుంచి బ్యాటరీ మార్చుకోవచ్చు. ఇంతకీ ఆ పద్ధతులు ఏంటో ముందు తెలుసుకోవాలి.


ఐఫోన్‌ 11 సిరీస్‌లో కొన్ని ఫోన్లలో ఉన్న బ్యాటరీ ముందు అనుకున్న సామర్థ్యం కలిగి లేవని యాపిల్‌ ఇప్పటికే గుర్తించింది. కొందరు వినియోగదారులు ఉపయోగిస్తున్న ఐఫోన్లలో ఆ లోపం స్పష్టంగా కనిపిస్తోంది.

అనూహ్యంగా బ్యాటరీ డౌన్‌, కొద్దివాటిలో కొన్ని సమస్యలు, పీక్‌ పర్ఫార్మెన్స్‌ సామర్థ్యంలో తగ్గుదల ఉంది. 

ఐఫోన్‌ 11, ఐఫోన్‌ 11ప్రొ, ఐఫోన్‌11 ప్రొ మాక్స్‌లో ఈ లోపాన్ని కనుగొన్నారు. 

ఐఓఎస్‌ 14.5ని యాపిల్‌ రిలీజ్‌ చేసింది. దాని ద్వారా బ్యాటరీ లోపాలను సరిదిద్దుతుంది.

సెట్టింగ్స్‌ యాప్‌లోకి వెళ్ళి - జనరల్‌ - సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ తద్వారా డౌన్‌లోడ్‌ చేసుకుని ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి.

ఐఔస్‌ 14.5కి అప్‌డేట్‌ కాగానే ఒక మెసేజ్‌ వస్తుంది. బ్యాటరీ హెల్త్‌ రీకాలిబ్రేటింగ్‌ జరుగుతోందని తెలియజేస్తుంది. 

గరిష్ఠ సామర్థ్యానికి బ్యాటరీ చేరుకోడానికి ముఖ్యంగా ఈ ప్రక్రియ సజావుగా జరిగేందుకు చాలా కాలం పడుతుంది. అది కొన్ని వారాలు కూడా కావచ్చు. అంతవరకు ఓపికపట్టాలి. అప్పటికి గాని వినియోగదారుడి ఐఫోన్‌ బ్యాటరీ రీప్లే్‌సమెంట్‌కు అర్హమైనదా కాదా అన్నది తేలదు. 

రీక్యాలిబ్రేటింగ్‌ విజయవంతం కానిపక్షంలో ఒక మెసేజ్‌ వస్తుంది. అలా మెసేజ్‌ అందుకున్న తరవాత యాపిల్‌ ఆథరైజేషన్‌ సెంటర్‌కు వెళితే బ్యాటరీని రీప్లేస్‌ చేస్తారు. 

ఏతావతా ఇదంతా కొంత సమయం తీసుకునే ప్రక్రియ. ఆ కారణంగా జాగ్రత్తగా ఒక అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్ళాలి.

Updated Date - 2021-05-01T05:30:00+05:30 IST