ధాన్యం పెండింగ్‌ బిల్లులపై నివేదికలు ఇవ్వాలి

ABN , First Publish Date - 2022-06-25T05:47:35+05:30 IST

జిల్లాలో ధాన్యంకొనుగోళ్లు ముగింపు దశకు వస్తున్న నేపథ్యంలో అందుకు చెల్లించాల్సిన పెండింగ్‌ బిల్లులపై నివే దికలను ఇవ్వాలని జాయింట్‌ కలెక్టర్‌ అభిషిక్త్‌కిషోర్‌ ఆదేశించారు.

ధాన్యం పెండింగ్‌ బిల్లులపై నివేదికలు ఇవ్వాలి

నెలాఖరుతో ముగుస్తున్న కొనుగోళ్లు 

జేసీ అభిషిక్త్‌కిషోర్‌


ఒంగోలు(కలెక్టరేట్‌), జూన్‌ 24 : జిల్లాలో ధాన్యంకొనుగోళ్లు ముగింపు దశకు వస్తున్న నేపథ్యంలో అందుకు చెల్లించాల్సిన పెండింగ్‌ బిల్లులపై నివే దికలను ఇవ్వాలని జాయింట్‌ కలెక్టర్‌ అభిషిక్త్‌కిషోర్‌ ఆదేశించారు. శుక్రవారం ఆయా శాఖల అధికారులతో తన కార్యాలయంలో నిర్వహించిన సమావేశం లో ఆయన మాట్లాడారు. 2021-22 సీజన్‌కు సంబంధించి ప్రభుత్వం కనీస మద్దతు ధరతో జిల్లాలో రైతుల వద్ద నుంచి ధాన్యంను కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరిస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ ధాన్యం కొనుగోళ్లు ముగింపు దశకు చేరుకుంటున్నందున అందుకు అవసరమైన చర్యలను తీసుకోవాలని ఆదేశించారు. ఈనెలాఖరులోపు ఈ కోనుగోళ్ల ప్రక్రియ ముగుస్తుందన్నారు. అందువల్ల  జిల్లాలో ఇప్పటి వరకు ఎంత ధాన్యంకొనుగోలు చేశారు, ఇంకా ఎంత ధాన్యం ఉంది, ఇతర పంటల వివరాలతో సమగ్ర నివేదికను అందజే యాలని చెప్పారు. సమావేశంలో సివిల్‌ సప్లయీస్‌ డీఎం గ్లోరియా, డీఎస్‌వో శ్యామ్‌కుమార్‌, డీసీవో రాజశేఖర్‌, డీసీఎంఎస్‌ డీఎం రామచంద్రరావు తది తరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-06-25T05:47:35+05:30 IST