T20 World Cup: టీమిండియాకి బిగ్ షాక్.. కోటి ఆశలు పెట్టుకున్న ఆటగాడు టీ20 వరల్డ్ కప్‌కి దూరం !

ABN , First Publish Date - 2022-09-29T21:47:28+05:30 IST

ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 వరల్డ్ కప్ (T20 World cup)కు స్టార్ పేసర్ జస్ర్పీత్ బుమ్రా (Jasprit Bumrah) దూరమవనున్నాడా ?

T20 World Cup: టీమిండియాకి బిగ్ షాక్.. కోటి ఆశలు పెట్టుకున్న ఆటగాడు టీ20 వరల్డ్ కప్‌కి దూరం !

ముంబై: ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 వరల్డ్ కప్ (T20 World cup)కు స్టార్ పేసర్ జస్ర్పీత్ బుమ్రా (Jasprit Bumrah) దూరమవనున్నాడా ?.. ఇప్పటికే బీసీసీఐ ఓ నిర్ణయానికి వచ్చిందా ?.. అనే ప్రశ్నలకు ఔననే సమాధానాలు వస్తున్నాయి. వెన్నెముక గాయం కారణంగా పేసర్ జస్ర్పీత్ బుమ్రా టీ20 వరల్డ్ కప్‌కు దూరం కానున్నాడని బీసీసీఐ (BCCI) వర్గాలు తెలిపినట్టు జాతీయ మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి. ‘‘ జస్ప్రీత్ బుమ్రా టీ20 వరల్డ్ కప్‌లో ఆడడం లేదు. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. అతడి వెన్నునొప్పి తీవ్ర స్థాయిలో ఉంది. ఆరు నెలలపాటు జట్టుకూ దూరం కానున్నాడు’’ అని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నట్టు పీటీఐ పేర్కొంది. అయితే ఈ వార్తలపై బీసీసీఐ ఇంకా అధికారికంగా స్పందించలేదు. అప్పటివరకు ఈ రిపోర్టుల్లో వాస్తవం ఎంతనేది చెప్పలేము. అయితే ఈ మీడియా రిపోర్టులకు బలం చేకూర్చుతూ తిరువనంతపురంలో ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య బుధవారం జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో బుమ్రా ఆడలేదు. వెన్నునొప్పి కారణంగా బుమ్రా పక్కనపెట్టి బీసీసీఐ అధికారికంగా వెల్లడింది. మంగళవారం ప్రాక్టిస్ సెషన్‌లో బుమ్రా వెన్నునొప్పితో బాధపడ్డాడని, ఈ కారణంగానే అతడిని ఆడించలేదని టాస్ పడడానికి కొన్ని నిమిషాల ముందు ట్విటర్ ద్వారా సమాచారాన్ని వెల్లడించింది.





చాహర్‌కు చోటు ఖాయమైనట్టేనా..

కాగా వెన్నునొప్పి కారణంగా ఆసియా కప్‌లో కూడా బుమ్రా ఆడలేదు. నేషనల్ క్రికెట్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఆస్ట్రేలియాపై చివరి 2 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. కాగా టీ20 వరల్డ్ కప్ భారత జట్టులో స్టాండ్‌బై బౌలర్ల జాబితాలో మొహమ్మద్ షమీ, దీపక్ చాహర్ ఉన్నారు. వీరిద్దరిలో ఒకరిని జట్టులోకి తీసుకునే అవకాశాలున్నాయి. బుధవారం రాత్రి దక్షిణాఫ్రికాపై మ్యాచ్‌లో దీపక్ చాహర్ రాణించాడు. షమీతో పోల్చితే చాహర్‌కి బ్యాటింగ్‌ సామర్థ్యం కూడా ఉండడం సానుకూలం.

Updated Date - 2022-09-29T21:47:28+05:30 IST