గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లు షురూ
ABN , First Publish Date - 2021-01-25T05:43:24+05:30 IST
ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలతోపాటు ప్రైవేట్ కార్యాలయాలు, స్వచ్ఛంద సంస్థ ల ఆధ్వర్యంలో వేడుకల నిర్వహణకు సర్వం సిద్ధం చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో నిర్వహించే వేడుకల ఏర్పాట్లను ఆదివారం అధికారులు, ప్రజాప్రతినిధులు పరిశీలించారు.
భువనగిరి రూరల్, జనవరి 24: ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలతోపాటు ప్రైవేట్ కార్యాలయాలు, స్వచ్ఛంద సంస్థ ల ఆధ్వర్యంలో వేడుకల నిర్వహణకు సర్వం సిద్ధం చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో నిర్వహించే వేడుకల ఏర్పాట్లను ఆదివారం అధికారులు, ప్రజాప్రతినిధులు పరిశీలించారు. ఈ సందర్భంగా భువనగిరి మునిసిపల్ చైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు, కలెక్టరేట్ ఏవో ఎం.నాగేశ్వరచారి, కమిషనర్ పూర్ణచందర్ ఏర్పాట్ల వివరాలు తెలుసుకున్నారు.