భారత రాజ్యాంగం పవిత్ర ప్రామాణిక గ్రంథం

Published: Wed, 26 Jan 2022 23:48:54 ISTfb-iconwhatsapp-icontwitter-icon
భారత రాజ్యాంగం పవిత్ర ప్రామాణిక గ్రంథం మాట్లాడుతున్న వీఎస్‌యూ వీసీ సుందరవల్లి

గణతంత్ర వేడుకల్లో వీసీ చాన్సలర్‌ సుందరవల్లి

వాడవాడలా మువ్వన్నెల జెండా రెపరెపలు


వెంకటాచలం, జనవరి 26 : భారత రాజ్యాంగం పవిత్ర ప్రామాణిక గ్రంథమని వీఎస్‌యూ వైస్‌ చాన్సలర్‌ జీఎం సుందరవల్లి పేర్కొన్నారు. మండలంలోని కాకుటూరు వద్ద ఉన్న వీఎస్‌యూలో బుధవారం గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ సుందరవల్లి జాతీయ జెండాను ఎగురవేసి ఎన్‌సీసీ విద్యార్థుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఎంతోమంది స్వతంత్ర పోరాట యోధుల కృషి ఫలితమే భారదేశానికి స్వాతంత్య్రం వచ్చిందన్నారు. కార్యక్రమంలో వీఎస్‌యూ రెక్టార్‌ ఎం.చంద్రయ్య, రిజిస్ర్టార్‌ డాక్టర్‌ లేబాకు విజయకృష్ణారెడ్డి, వర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్‌ సుజాఎస్‌ నాయర్‌ తదితరులున్నారు.

వెంకటాచలం ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డి పాల్గొని, జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా నిరుపేద గిరిజనులకు ఆధార్‌ కార్డులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ మందా కవితా, జడ్పీటీసీ పోట్లూరి సుబ్రహ్మణ్యం, వైస్‌ ఎంపీపీ కనుపూరు కోదండరామిరెడ్డి, ఎంపీడీవో సరళ, తహసీల్దారు ఐఎస్‌ ప్రసాద్‌, గృహనిర్మాణ శాఖ ఏఈ సీహెచ్‌ వెంకటేశ్వర్లు, పలువురు వైసీపీ నేతలు పాల్గొన్నారు. అలాగే తహసీల్దారు కార్యాలయం, ఎంపీడీవో కార్యాలయం, పోలీసుస్టేషన్‌, రైల్వేస్టేషన్‌, మండల వ్యవసాయాధికారి కార్యాలయం, గృహ నిర్మాణ శాఖ కార్యాలయం, స్వర్ణభారత్‌ ట్రస్టుతో పాటు మండలంలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, గ్రామ సచివాలయాలలోనూ జాతీయ జెండాను ఎగురవేశారు.  


అత్యుత్తుమ పోర్టుగా అదానీ కృష్ణపట్నం పోర్టు

గణతంత్ర దినోత్సవంలో సీఈవో అవినాష్‌చంద్‌ రాయ్‌ 


ముత్తుకూరు : దేశంలోనే అత్యుత్తమ స్థాయికి అదానీ కృష్ణపట్నం పోర్టును అభివృద్థి చేస్తామని పోర్టు సీఈవో అవినాష్‌చంద్‌ రాయ్‌ పేర్నొన్నారు. అదానీ స్కిల్‌ డెవలెప్‌మెంట్‌ సెంటర్‌లో బుధవారం ఘనంగా నిర్వహించిన 73వ గణతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం సాధించిన అమర వీరులను స్మరించుకోవాలన్నారు.  కృష్ణపట్నం పోర్టు ప్రస్తుతం ప్రతిష్టాత్మకమైన అదానీ గ్రూప్‌తో భాగమై, అభివృద్థి దిశగా అడుగులు వేస్తుందన్నారు. గణతంత్ర దినోత్సవ సందర్భంగా సెక్యూరిటీ సిబ్బంది నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించి, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సెక్యూరిటీ సిబ్బందికి బహుమతులను ప్రదానం చేశారు. అకాడమీ ప్రాంగణంలో మొక్కలను నాటారు. కార్యక్రమంలో అడ్మిన్‌ హెడ్‌ గణేశ్‌ శర్మ, మోహిత్‌ షెకావత్‌,  అశోక్‌మిశ్రా, గుడివాడ శ్రీకాంత్‌, మనోహర్‌బాబు, అదానీ పోర్టు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అలాగే మండల తహసీల్దారు కార్యాలయంలో తహసీల్దారు సోమ్లానాయక్‌, సీఐ కార్యాలయంలో కృష్ణపట్నం సీఐ వేమారెడ్డి, ఎస్‌ఐలు శివకృష్ణారెడ్డి, అంజిరెడ్డిలు, ఈదూరు ఈశ్వరమ్మ జడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు చెంచురామయ్య జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, గణతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. 


ఇందుకూరుపేట : మండలంలోని పల్లెపాడు పినాకిని సత్యాగ్రహ గాంధీ ఆశ్రమంలో కో-కన్వీనర్‌ నెల్లూరు రవీంద్రరెడ్డి ఆధ్వర్యంలో 73వ గణతంత్ర వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ముందుగా పల్లెపాడు సర్పంచ్‌ రెడ్డిపోగు సుధాకర్‌ మహాత్మాగాంధీ,   పొణకా కనకమ్మ విగ్రహాలకు ఖాదీ వస్త్రాలు, నూలు మాలలు సమర్పించారు. అనంతరం జాతీయ జెండాను పల్లెపాడు ఎంపీపీ స్కూల్‌ ఉపాధ్యాయురాలు సీహెచ్‌.రేవతి ఆవిష్కరించారు. అనంతరం కో-కన్వీనర్‌ రవీంద్రరెడ్డి,  కోర్‌ కమిటీ సభ్యురాలు గంపల మంజుల, సర్పంచ్‌ రెడ్డిపోగు సుధాకర్‌ పిల్లలందరికీ 73వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో సభ్యులు గణేశం సుమంత్‌రెడ్డి, ఆశ్రమ కమిటీ సభ్యులు రెడ్డిపోగు శేషమ్మ, స్కూల్‌ విద్యార్థులు, గ్రామస్థులు పాల్గొన్నారు.  


మండల కార్యాలయాల్లో..: మండలంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. మండల కార్యాలయాల భవన సముదాయంలో ఎంపీడీవో రఫీఖాన్‌ జెండా ఆవిష్కరించారు. సీడీపీవో కార్యాలయంలో సీడీపీవో హేమాసుజని జెండా ఎగురవేశారు. రెవెన్యూ, విద్యాశాఖ, పలు శాఖల ఇంజనీర్లు పాల్గొన్నారు. పంచాయతీ కార్యాలయాల్లో సర్పంచులు జెండా ఎగురవేశారు. పాఠశాలల్లో కూడా ప్రధానోపాఽధ్యాయులు జెండా ఎగురవేసి, పిల్లలకు మిఠాయిలు పంచిపెట్టారు.   


కోవూరు : 73వ గణతంత్ర దినోత్సవాన్ని మండలంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. సీనియర్‌ సివిల్‌ జడ్డి కోర్టు ఆవరణలో సీనియర్‌ సివిల్‌ జడ్జి మురళీధరన్‌ జాతీయపతాకాన్ని ఎగురవేసి, వందనం చేశారు. తహసీల్దారు కార్యాలయ ఆవరణలో తహసీల్దారు సీహెచ్‌.సుబ్బయ్య, పోలీసు సర్కిల్‌ కార్యాలయంలో సీఐ రామకృష్ణారెడ్డి, ఎస్‌ఐ వెంకటేశ్వరరావు, మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలో ఎంపీడీవో శ్రీహరి, సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో సబ్‌రిజిస్ర్టార్‌ కోటేశ్వరమ్మ జెండా ఎగురవేశారు. అలాగే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ లక్ష్మీప్రసన్న, గీతాంజలి ఇంజనీరింగ్‌ కళాశాలలో ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సుబ్బారావు, పడుగుపాడు పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శి కృష్ణమూర్తి, సర్పంచు లక్ష్మీనారాయణ, జడ్పీటీసీ కవరగిరి శ్రీలత, పడుగుపాడు సొసైటీలో కార్యదర్శి కొండూరు గోవర్ధనరెడ్డి, పశుసంవర్ధకశాఖ జిల్లా కార్యాలయంలో  ఆ సంస్థ చైర్మన్‌   గొల్లప్రోలు విజయకుమార్‌ జాతీయపతాకం ఎగురవేశారు.  


పొదలకూరు : వాడవాడలా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. మండలంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తహసీల్దారు కార్యాలయంలో తహసీల్దారు వీ.సుధీర్‌, ఎంపీడీవో కార్యాలయంలో ఇన్‌చార్జ్‌ ఎంపీడీవో నారాయణరెడ్డి, పోలీస్‌స్టేషన్‌లో సీఐ సంగమేశ్వరరావు, ఎస్‌ఐ కరీముల్లా జాతీయ పతాకం ఎగురవేశారు. అలాగే మార్కెట్‌ కమిటీ కార్యాలయంలో మార్కెట్‌ కమిటీ కార్యదర్శి అనితాకుమారి, వ్యవసాయ కార్యాలయంలో ఏవో వాసు, సీడీపీవో కార్యాలయంలో సీడీపీవో విజయలక్ష్మి, ట్రెజరీ కార్యాలయంలో ఉప కోశాధికారి కాలేషా, సాంఽఘిక సంక్షేమ శాఖ కార్యాలయంలో ఏఎస్‌డబ్ల్యూవో నరసింహారెడ్డి, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు జెండా ఎగురవేశారు.   అనంతరం విద్యార్థులకు మిఠాయిలు పంచిపెట్టారు. 


మనుబోలు: 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా బుధవారం త్రివర్ణపతాకం ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, బ్యాంకులు, ఇతర ప్రైవేట్‌ కార్యాలయాల వద్ద రెపరెపలాడింది. మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీడీవో వెంకటేశ్వర్లు, తహసీల్దారు కార్యాలయంలో తహసీల్దారు నాగరాజు, పోలీస్‌ స్టేషన్‌లో ఎస్‌ఐ కే.ముత్యాలరావు, పీహెచ్‌సీలో వైద్యులు సుబ్బరాజు, మనుబోలు పంచాయతీ కార్యాలయంలో సర్పంచు కంచి పద్మమ్మ జాతీయ జెండాను ఆవిష్కరించారు.  ఈ కార ్యక్రమాల్లో  జడ్పీటీసీ సభ్యురాలు చిట్టమూరు అనితమ్మ, ఎంపీపీ గుండాల వజ్రమ్మ, ఉపాఽధ్యక్షుడు వెంకటరమణారెడ్డి, ఎంపీటీసీ సభ్యులు రాజేశ్వరి, కల్పన, ఉపసర్పంచు కడివేటి చంద్రశేఖర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలాగే   మనుబోలు దళితవాడ ప్రాథమిక పాఠశాలలోని 37మంది విద్యార్థులకు వలంటీర్‌ మోచర్ల మల్లికార్జున విద్యాసామగ్రి అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అనిత మల్లికార్జునను అభినందించారు. 


బుచ్చిరెడ్డిపాళెం : గణతంత్ర దినోత్సవం సందర్భంగా వాడవాడలా మువ్వన్నెల జెండాలు రెపరెపలాడాయి. ఈ సందర్భంగా బుచ్చి నగర పంచాయతీతో పాటు మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కార్యాలయాల్లో అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ముందుగా జాతీయ పతాకం ఎగురవేసి వందనాలర్పించారు. పాఠశాలల్లో విద్యార్థులు ధరించిన పలు వేషధారణలు అందరినీ అలరించాయి.  బుచ్చిలో తహసీల్దారు కార్యాలయం, ఎంపీడీవో, నగర పంచాయతీ, పోలీస్‌స్టేషన్‌, వెలుగు, ఐసీడీఎస్‌, సెబ్‌, పశుసంవర్ధక,. ఇరిగేషన్‌తోపాటు వవ్వేరు బ్యాంకు, బుచ్చి బ్యాంకుతో పాటు పలు శాఖల కార్యాలయాలలో జాతీయ పతాకం ఎగురవేశారు. నగర పంచాయతీ కార్యాలయంలో  చైర్‌పర్సన్‌ మోర్ల సుప్రజామురళి, కమిషనర్‌ శ్రీనివాసరావు, కౌన్సిలర్లు, సిబ్బంది జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమాల్లో తహసీల్దారు ఎస్‌ఎం హమీద్‌,, ఎంపీడీవో నరసింహారావు, సీఐ సీహెచ్‌. కోటేశ్వరరావు, ఎస్‌ఐ ప్రసాద్‌రెడ్డి, ఏపీఎం లలిత, సీడీపీవో సౌజన్య పాల్గొన్నారు.  

ోటపల్లిగూడూరు : మండలంలోని నరుకూరు సచివాలయంలో గణతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి   ముఖ్యఅతిథిగా సర్పంచు అన్నం శారద పాల్గొన్నారు. అనంతరం ఎంపీటీసీ రఘుబాబు జాతీయ జెండాను ఆవిష్కరించారు. సౌత్‌ ఆములూరు స్కూల్‌లో ఉపాధ్యాయులు షేక్‌.అహ్మద్‌బాషా ఆధ్వర్యంలో   జరిగిన గణతంత్ర వేడుకల్లో మండల ఉపాఽధ్యక్షుడు చెరుకూరి శ్రీనివాసులు, సర్పంచు సరళకుమారి, స్కూల్‌ చైర్మన్‌ రంగినేని స్వాతి, తదితరులు పాల్గొన్నారు. నరుకూరులో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అన్నం శ్రీనివాసులు, డాక్టర్‌ సుబ్బారావు, పాకం వెంకయ్య, సూరిబాబు, తుళ్లూరు  జనార్ధన్‌, పరదేశి, తదితరులు పాల్గొన్నారు. అలాగే మండలంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కార్యాలయాల్లో 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి.   

భారత రాజ్యాంగం పవిత్ర ప్రామాణిక గ్రంథంజాతీయ జెండాకు వందనం చేస్తున్న జడ్జి మురళీధరన్‌


భారత రాజ్యాంగం పవిత్ర ప్రామాణిక గ్రంథంఇందుకూరుపేట: గాంధీ ఆశ్రమంలో గాంధీకి నివాళులర్పిస్తున్న కోర్‌ కమిటీ సభ్యులు


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.