ఘనంగా గణతంత్ర వేడుకలు

ABN , First Publish Date - 2022-01-27T05:25:13+05:30 IST

నంద్యాల పట్టణంలోని పలు విద్యాసంస్థల్లో, ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థల కార్యాలయాల్లో 73వ గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఘనంగా గణతంత్ర వేడుకలు
నంద్యాల గాంధీచౌక్‌లో జెండా ఎగురవేస్తున్న ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ

నంద్యాల(నూనెపల్లె), జనవరి 26: నంద్యాల పట్టణంలోని పలు విద్యాసంస్థల్లో, ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థల కార్యాలయాల్లో 73వ గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక భువన విజయం జూనియర్‌ కళాశాలలో వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగాఎమ్మెల్సీ ఇసాక్‌బాషా హాజరై జెండాను ఎగురవేశారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కళాశాల ప్రిన్సిపాల్‌ వెంకటసుబ్బయ్య, డైరెక్టర్లు కౌజర్‌బాషా, నవభారత్‌ హుసేన్‌ పాల్గొన్నారు.  నంద్యాల డివిజన్‌ దివ్యాంగుల సంక్షేమ సంఘం, కళారాధన, క్రీడా సమాఖ్య కార్యాలయ ఆవరణలో గణతంత్ర వేడుకలు నిర్వహించారు. రాష్ట్ర ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్‌ జి.రవికృష్ణ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెం డాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వెంకట్రావు, నాగరాజు, చలపతి, రామయ్య, మధుబాబు పాల్గొన్నారు. నంద్యాల విజయ పాల డెయిరీలో గణతంత్ర వేడుకలు నిర్వహించారు. డైయిరీ చైర్మన్‌ ఎస్వీ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జెం డాను ఎగురవేశారు. కార్యక్రమంలో ఎండీ పరమేశ్వరరెడ్డి, బోర్డు డైరెక్టర్‌ గంగుల విజయసింహారెడ్డి, అధికారులు, కార్మికులు పాల్గొన్నారు. 


నంద్యాల టౌన్‌: దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన ఎందరో మహానీయుల త్యాగాలను మరువరాదని నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా అన్నారు. బుధవారం మున్సిపల్‌ కార్యాలయంలో, గాంధీచౌక్‌ సెంటర్‌లో జరిగిన గణతంత్ర వేడుకల్లో పాల్గొని జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మాబున్నీసా, కమిషనర్‌ వెంకటకృష్ణ పాల్గొన్నారు.  నంద్యాల సబ్‌ కలెక్టరేట్‌ కార్యాలయంలో గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. సబ్‌ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ జాతీయ జెండా ను ఎగురవేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ 1947ఆగస్టు 15న మనకు స్వాతం త్య్రం వచ్చిందని, అయితే ప్రత్యేకంగా రూపొందించుకున్న భారత రాజ్యాంగం 1950జనవరి 26న అమలులోకి రావడంతో గణతంత్ర దినంగా నిర్వహించుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో ఏవో హరినాథరావు, డిప్యూటీ ఎస్‌వో ఆల్లీపీరా పాల్గొన్నారు.  నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో 73వ గణతంత్ర వేడుకలను ఏడీఆర్‌ డాక్టర్‌ ఎన్‌సీ వెంకటేశ్వర్లు అధ్యక్షతన నిర్వహించారు. అలాగే జమాతే ఇస్లామి హింద్‌, పట్టణ కాంగ్రెస్‌ కమిటీ, ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదికతోపాటు పలు ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజాసంఘాలు, వామపక్ష పార్టీల కార్యాలయాల్లో గణతంత్ర వేడుకలను నిర్వహించారు. 


నంద్యాల(కల్చరల్‌): నంద్యాల చాబోలు రోడ్డులోని శ్రీవాసవీ వృద్ధాశ్రమంలో బుధవారం గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. వృద్ధాశ్రమ దాత కాల్వ ఎల్లా వెంకటసుబ్బయ్య జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో  డాక్టర్‌ గెలివి సుబ్రహ్మణ్యం, ఆశ్రమ నిర్వాహకులు పాల్గొన్నారు. 


గోస్పాడు: మండలంలోని ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాల్లో గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. పోలీసుస్టేషన్‌లో ఎస్‌ఐ నాగరాజు, తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ మంజుల, మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ అర్థర్‌, శ్రీరామ్‌ నగర్‌  ప్రభుత్వ పాఠశాలలో హెచ్‌ఎం విజయరావు, గ్రంథాలయంలో అధికారి భాగ్యలక్ష్మి, మోడల్‌ స్కూల్‌లో ప్రిన్సిపాల్‌ ఇష్రాత్‌బేగం జెండా ఆవిష్కరించారు. 


పాణ్యం: మండలంలో గణతంత్ర వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. తహసీల్దారు శివప్రసాదరెడ్డి, సీఐ జీవన్‌గంగనాథ్‌, ఎస్‌ఐ సుధాకరరెడ్డి, ఎంపీడీవో దస్తగిరి. ఎంఈవో కోటయ్య, పంచాయతీ కార్యదర్శి అనూరాధ, ఏఓ జయప్రకా్‌షరెడ్డి తమ కార్యాలయాల వద్ద జెండాను ఆవిష్కరించారు.  చెత్త సంపదకేంద్రం వద్ద గాంధీ విగ్రహానికి సర్పంచ్‌ పల్లవి, ఉపసర్పంచ్‌ చంద్రశేఖర రెడ్డి, మాజీ సర్పంచ్‌ మేకల సుబ్బరాయుడు పూలమాల వేసి నివాళి అర్పించారు. 


ఆళ్లగడ్డ: పట్టణంలోని కోర్టు ఆవరణలో జిల్లా ఐదో అదనపు జడ్జి అమ్మన్నరాజా, పోస్టాఫీసులో పోస్టల్‌ ఇన్స్‌స్పెక్టర్‌ చంద్రమౌళీశ్వరరెడ్డి, డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ రాజేంద్ర, తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ రమే్‌షరెడ్డి, మున్సిపల్‌ కార్యాలయంలో కమిషనర్‌ కిశోర్‌ జెండాను ఎగుర వేశారు. ఎంఈవో కార్యాలయంలో ఎంపీపీ గజ్జల రాఘవేంద్రారెడ్డి, ఎంఈవో శోభావివేకవతి, వ్యవసాయ కార్యాలయంలో ఏడీఏ రామ్మోహన్‌రెడ్డి, ఆర్‌డబ్ల్యుఎస్‌ కార్యాలయంలో డీఈ రవికుమార్‌, పీఆర్‌ కార్యాలయంలో డీఈ సుబ్రహ్మణ్యం, పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో సీఐ కృష్ణయ్య, రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో సీఐ రాజశేఖరరెడ్డి, వైద్యశాలలో వైద్యురా లు సుజాతమ్మ, ఆర్టీసీ కార్యాలయంలో డీఎం రాజశేఖరరెడ్డి జెండాను ఎగుర వేశారు. 


శిరివెళ్ల: మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో గణతంత్ర వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఎంపీడీవో కార్యాలయంలో, మోడల్‌ స్కూల్‌, కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో ఎంపీపీ నాయక్‌ మహమ్మద్‌ వసీం, తహసీల్దార్‌ కార్యాలయంలో ఇన్‌చార్జి తహసీల్దార్‌ మాధవ, పోలీస్‌ స్టేషన్‌లో సీఐ చంద్రబాబునాయుడు, ఎస్‌ఐ శరత్‌ కుమార్‌రెడ్డి, యర్రగుంట్ల గంగుల తిమ్మారెడ్డి ప్రభుత్వ డిగ్రీ, జూనియర్‌ కళాశాలల్లో జెండా ఆవిష్కరించారు. ఎంపీడీవో ఉమామహేశ్వరరావు, ఈవోపీఆర్డీ సాల్మన్‌ పాల్గొన్నారు. 


చాగలమర్రి: స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో మండల ఉపాధ్యక్షుడు ముల్లారఫి, ఎంపీడీవో షేక్‌ షంషాద్‌బాను, మండల కో-ఆప్షన్‌ సభ్యుడు ఇబ్రహిమ్‌ జెండాను ఆవిష్కరించారు. గ్రామ సచివాలయంలో సర్పంచ్‌ తులశమ్మ, ఈవో సుదర్శన్‌రావు, పోలీసు స్టేషన్‌, గ్రామ చావిడిల్లో ఎస్‌ఐ మారుతి, గ్రంఽథాలయంలో గ్రంఽథాలయాధికారి రామచంద్రుడు, బీసీ కార్యాలయంలో ఆ సంఘ అధ్యక్షుడు లక్ష్మీనారాయణగౌడ్‌, కస్తూర్బా పాఠశాలలో ఎంఈవో అనూరాధ, విద్యుత్‌ కార్యాలయంలో ఏఈ షాజహాన్‌, ప్రభుత్వ వైద్యశాలలో వైద్యుడు గంగాధర్‌ జెండాను ఆవిష్కరించారు. విద్యార్థులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. 


ఓర్వకల్లు: మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కార్యాలయాల్లో బుధవారం గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ శివరాముడు, గుట్టపాడు సచివాలయంలో పంచాయతీ కార్యదర్శి విజయపరిమళ, గుట్టపాడు సర్పంచ్‌ నర్లమోహన్‌ రెడ్డి, పోలీ్‌సస్టేషన్‌లో ఎస్‌ఐ మల్లికార్జున, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో శివనాగప్రసాద్‌, సీఎల్‌ఆర్‌సీ భవనంలో ఏపీడీ లక్ష్మన్న, ఎంఆర్‌సీలో ఎంఈవో సోమశేఖర్‌, ఆర్‌సీ ఎల్లారెడ్డి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ప్రిన్సిపాల్‌ గురువయ్యశెట్టి, జడ్పీహై స్కూల్‌లో ప్రధానోపాధ్యాయురాలు ధనలక్ష్మి, సోమయాజులపల్లెలో సర్పంచ్‌ జయమ్మ, వెంకటరెడ్డి, కమిటీ చైర్మన్‌ శివరాముడు, ఓర్వకల్లు సచివాలయంలో ఈవోఆర్‌డీ సుబ్బరాయుడు, మోడల్‌ స్కూల్‌లో ప్రిన్సిపాల్‌ షాహీనా పర్వీన్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో టీడీపీ ఉపాధ్యక్షుడు మోహన్‌ రెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు రంగనాథగౌడు, ఎంపీపీ తిప్పన్న, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు. 


రుద్రవరం: మండలంలో గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయా కార్యాలయాల్లో తహసీల్దార్‌ వెంకటశివ, ఎంపీడీవో మధుసూదన్‌రెడ్డి జెండాను ఎగురవేశారు. అలాగే ఎంపీపీ బాలస్వామి గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. మండలంలోని ఆయా గ్రామాల్లో  సర్పంచ్‌లు జెండాను ఎగురవేశారు.


ఉయ్యాలవాడ: మండలంలోని అన్ని గ్రామాల్లో బుధవారం గణతంత్ర వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ సుభద్ర, పోలీసు స్టేషన్‌ ఆవరణలో ఎస్‌ఐ మల్లికార్జున, స్థానిక సబ్‌స్టేషన్‌లో విద్యుత్‌ ఏఈ గుర్రప్ప, ఆదర్శ పాఠశాలలో ప్రిన్సిపాల్‌ నూర్జాహన్‌, ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు ఉసేన్‌పీరా జాతీయ జెండాను ఎగురవేశారు. స్థానిక 4వ అంగన్‌వాడీ కేంద్రంలోని చిన్నారులు వివిధ దేశ నాయకులు, అధికారుల వేషఽధారణలతో అందరిని ఆకట్టుకున్నాయి. 


దొర్నిపాడు: మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కార్యాలయాల్లో బుధవారం గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. దొర్నిపాడు ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో సుబ్రహ్మణ్యం, తహసీల్దార్‌ జయప్రసాదు, పోలీసు స్టేషన్‌ ఆవరణలో ఎస్‌ఐ కె.కీర్తి, ప్రభుత్వ వైద్యశాలలో వైద్యుడు నాగేంద్ర, పశువైద్యశాలలో వైద్యురాలు హరిత, బాలుర వసతి గృహంలో వార్డెన్‌ చంద్రశేఖర్‌రెడ్డి, గ్రంథాలయంలో గ్రంథాలయాధికారి బెల్తాజర్‌, దొర్నిపాడు, గుండుపాపల, కొండాపురం సొసైటీ కార్యాలయాల్లో  సొసైటీ అధ్యక్షులు, దొర్నిపాడు జడ్పీహెచ్‌ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు నారాయణరెడ్డి, కొత్తపల్లె పాఠశాలలో ఎంఈవో మనోహర్‌రెడ్డి, కస్తూర్బా పాఠశాలలో వార్డెన్‌ జ్యోతి జెండాను ఎగుర వేశారు. 


గడివేముల: మండలంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో విజయసింహారెడ్డి, గడివేముల హైస్కూల్‌లో జడ్పీటీసీ ఆర్‌బీ చంద్రశేఖర్‌రెడ్డి, పోలీసు స్టేషన్‌లో ఎస్‌ఐ శ్రీధర్‌, మండల రెవెన్యూ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్‌ సుభాకర్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. గడివేముల హైస్కూల్‌లో పూర్వ విద్యార్థి ఉసేన్‌రెడ్డి కంప్యూటర్‌ను పాఠశాలకు వితరణగా అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ నాగమద్దమ్మ, ఎంపీటీసీ మద్దమ్మ, గడివేముల సర్పంచ్‌ రవణమ్మ, ఉపసర్పంచ్‌ బాలచెన్ని పాల్గొన్నారు. 



Updated Date - 2022-01-27T05:25:13+05:30 IST