ఏం చేసినా నిద్ర పట్టడం లేదా?.. అయితే ఇదొక్కటే చాలు.. ఎయిమ్స్ పరిశోధనల్లో ఆశ్చర్యకర ఫలితాలు..

ABN , First Publish Date - 2021-11-13T16:22:42+05:30 IST

నిద్ర పట్టక ఇబ్బంది పడుతున్నవారికి..

ఏం చేసినా నిద్ర పట్టడం లేదా?.. అయితే ఇదొక్కటే చాలు.. ఎయిమ్స్ పరిశోధనల్లో ఆశ్చర్యకర ఫలితాలు..

నిద్ర పట్టక ఇబ్బంది పడుతున్నవారికి భారీ ఉపశమనం కలిగించే వార్త ఇది. బీహార్‌లోని పట్నా ఎయిమ్స్ పరిశోధకులు.. పడుకునే ముందు ముందు మ్యూజీక్ వినడం ద్వారా మంచి నిద్ర పడుతుందని కనుగొన్నారు. వీరి పరిశోధనలో 432 హెర్ట్స్ ఫ్రీక్వెన్సీ కలిగిన సంగీతాన్ని వినడం ద్వారా గాఢమైన నిద్ర పడుతుందని తేలింది. ఈ పరిశోధనలను.. 30 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు కలిగిన ఆరోగ్యవంతులైన వారిపై నిర్వహించారు. ఫిజియాలజీ విభాగానికి చెందిన అడిషినల్ ప్రొఫెసర్ డాక్టర్ కమలేష్ ఝా ఈ పరిశోధనల గురించి మాట్లాడుతూ.. పట్నా ఎయిమ్స్‌లో నిద్ర గురించి నిరంతర పరిశోధనలు జరుగుతున్నాయి.


నిద్రకు మ్యూజిక్ ఎంతవరకూ ఉపకరిస్తుందనే దానిపై పరిశోధనలు సాగిస్తున్నాం. పూర్తిస్థాయి ఆరోగ్యవంతులపై నిద్రకు సంబంధించిన ప్రయోగాలు జరుగుతున్నాయి. వివిధ వయసులు కలిగిన వారిని ఇందులో భాగస్వాములను చేస్తున్నాం. అయితే ఒక స్థాయి ఫ్రీక్వెన్సీ కలిగిన మ్యూజిక్ వినడం ద్వారా త్వరగా నిద్ర వస్తుందని, గాఢమైన నిద్ర పడుతుందని కనుగొన్నామన్నారు. వివిధ ఫ్రీక్వెన్సీలను ఆధారంగా చేసుకుని ఈ పరిశోధనలు చేయగా, 432 హెర్ట్స్ ఫ్రీక్వెన్సీ కలిగిన మ్యూజిక్ వినడం ద్వారా అద్భుతమైన ఫలితాలు వచ్చాయన్నారు. ఇది ఐడియల్ ప్రీక్వెన్సీ అని, దీనివలన మస్తిష్కానికి ప్రశాంతత లభిస్తుందన్నారు. 


Updated Date - 2021-11-13T16:22:42+05:30 IST