అధికారులపై సభ్యుల ఆగ్రహం

ABN , First Publish Date - 2022-10-01T05:09:27+05:30 IST

పలువురు మండల అధికారులపై పలువురు ప్రజాప్రతినిధులు ఆగ్ర హం వ్యక్తం చేశారు. ఎంపీపీ ఉమాదేవి అధ్యక్షత న మండల సర్వసభ్య సమావేశం శుక్రవారం జరి గింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వేముల వాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌బాబు హాజర య్యారు.

అధికారులపై సభ్యుల ఆగ్రహం
మాట్లాడుతున్న ఎమ్మెల్యే రమేష్‌బాబు

- మేడిపల్లి మండల సర్వసభ్య సమావేశం

మేడిపల్లి, సెప్టెంబరు 30: పలువురు మండల అధికారులపై పలువురు ప్రజాప్రతినిధులు ఆగ్ర హం వ్యక్తం చేశారు. ఎంపీపీ ఉమాదేవి అధ్యక్షత న మండల సర్వసభ్య సమావేశం శుక్రవారం జరి గింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వేముల వాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌బాబు హాజర య్యారు. ఈ సందర్భంగా అభివృద్ధి పనులపై సమీక్షను నిర్వహించారు. సభ్యులు మాట్లాడుతూ మిషన్‌ భగీరథ నీరు గ్రామాల్లోకి రావడం లేదని, పలు చోట్ల లీకేజీకి మరమ్మతులు చేయడం లేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధి హమీ పనులకు సంబంధించిన సమాచారం సర్పంచ్‌లకు ఇవ్వడం లేదని ఆరోపించారు.  జడ్పీ వైస్‌చైర్మన్‌ హరిచరణ్‌రావు, సర్పంచ్‌లు నరేష్‌రెడ్డి, వెంకటేశం, వరలక్ష్మి, నారాయణరెడ్డి, అభిలాష్‌, సమత, ఎంపీటీసీలు, సింగిల్‌ విండో చైర్మన్‌లు, అధికారులు పాల్గొన్నారు. మండల కేంద్రంలో ఆగ్రోస్‌ రైతు సేవా కేంద్రాన్ని ఎమ్మెల్యే రమేష్‌బాబు ప్రారంభించారు.  

Updated Date - 2022-10-01T05:09:27+05:30 IST