గిరిజనులకు రిజర్వేషన్‌ పెంచాలి

ABN , First Publish Date - 2022-05-19T04:37:06+05:30 IST

గిరిజనులకు రిజర్వేషన్‌ పెంచడంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చిత్తశుద్ధి లేదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ కొత్తపల్లి శ్రీనివాస్‌ అన్నారు. బుధవారం కాగజ్‌నగర్‌ తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టి తహసీల్దార్‌ ప్రమోద్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు.

గిరిజనులకు రిజర్వేషన్‌ పెంచాలి
వినతి పత్రం అందజేస్తున్న బీజేపీ నాయకులు

- బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ శ్రీనివాస్‌

- తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేత

కాగజ్‌నగర్‌ టౌన్‌, మే 18: గిరిజనులకు రిజర్వేషన్‌ పెంచడంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చిత్తశుద్ధి లేదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ కొత్తపల్లి శ్రీనివాస్‌ అన్నారు. బుధవారం కాగజ్‌నగర్‌ తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టి తహసీల్దార్‌ ప్రమోద్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు డాక్టర్‌ శ్రీనివాస్‌, డాక్టర్‌ పాల్వాయి హరీశ్‌బాబు మాట్లాడుతూ గిరిజనులకు దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని కోరితే 2017లో 12శాతంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ హామీ ఇచ్చి, రిజర్వేషన్‌ బిల్లుతో పాటు బీసీ-ఇ బిల్లు పెట్టి కేంద్రానికి పంపించి మెలిక పెట్టారని పేర్కొన్నారు. గిరినులకు రిజర్వేషన్లు పెంచక పోవడంతో వారు అన్నిరంగాల్లో నష్టపోతున్నారన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా గిరిజనులకు రిజర్వేషన్లు పెంచేందుకు చర్యలు తీసుకోవాలని బీజేపీ గిరిజనమోర్చా ఆధ్వ ర్యంలో ఇచ్చిన వినతిపత్రంలో పేర్కొన్నారు. కార్యక్రమంలో మహిళామోర్చా రాష్ట్రకార్యవర్గ సభ్యురాలు సిద్ధంశెట్టి సుహాసిని, జిల్లాప్రధానకార్యదర్శి కొంగ సత్యనారాయణ, సర్పంచ్‌శ్రీనివాస్‌, నాయకులుపాల్గొన్నారు.

ఆసిఫాబాద్‌: గిరిజనులకు 12శాతం రిజర్వేషన్‌ పెంచాలని బీజేపీ ఆధ్వర్యంలో శుక్రవారం తహసీల్దార్‌ ఎజాజ్‌ఖాన్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్ర మంలో బీజేపీ నాయకులు సతీష్‌బాబు, విశాల్‌, మురళీ,శ్రావణ్‌, తిరుపతి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

సిర్పూర్‌(యూ): రాష్ట్రంలో గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్‌ కలిపించాలని బీజేపీ గిరిజన మోర్చ జిల్లా శాఖ ఆధ్వర్యంలో బుధవారం తహసీల్దార్‌ రహీమొది ్దన్‌కు వినతిపత్రం ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో 4శాతం ఉన్న గిరిజన రిజర్వేషన్‌ను 1986లో అప్పటి ముఖ్య మంత్రి ఎన్‌టి రామారావు జీవోనం.167ద్వారా 6శాతా నికి పెంచారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటు గిరిజను లకు అటు మైనారిటీలను మోసం చేస్తుందన్నారు. వెంటనే గిరిజనరిజర్వేషన్‌ పెంచాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో బీజేపీ గిరిజన మోర్చా జిల్లా కార్యదర్శి రాజయ్య, జిల్లానాయకుడు రవీందర్‌, మానిక్‌, శంభు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-19T04:37:06+05:30 IST