Bank Holidays: ఆగస్ట్‌లో బ్యాంకులకు అన్ని రోజులు సెలవులా.. ఎప్పుడెప్పుడో క్లారిటీగా తెలుసుకోండి..

ABN , First Publish Date - 2022-07-24T23:24:44+05:30 IST

ఆన్‌లైన్ చెల్లింపులు (Online Money Transactions) ఎంతగా అందుబాటులోకి వచ్చినప్పటికీ బ్యాంకులకు సెలవులు (Bank Holidays) వస్తే ఖాతాదారులకు..

Bank Holidays: ఆగస్ట్‌లో బ్యాంకులకు అన్ని రోజులు సెలవులా.. ఎప్పుడెప్పుడో క్లారిటీగా తెలుసుకోండి..

ఆన్‌లైన్ చెల్లింపులు (Online Money Transactions) ఎంతగా అందుబాటులోకి వచ్చినప్పటికీ బ్యాంకులకు సెలవులు (Bank Holidays) వస్తే ఖాతాదారులకు ఎంతో కొంత ఇబ్బంది తప్పదు. ముఖ్యంగా చెక్కుల క్లియరెన్స్ విషయంలో ఎదురయ్యే ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank Of India) క్యాలెండర్ (RBI Calendar) ప్రకారం జూలై నెలలో బ్యాంకులకు 14 రోజులు సెలవులు వచ్చాయి. వచ్చే నెల అయిన ఆగస్ట్‌లో కూడా బ్యాంకులు 13 రోజులు మూతపడనున్నాయి. అయితే.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్యాలెండర్‌లోని సెలవులు (RBI Calendar Holidays) దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులన్నింటికీ (Banks) ఒకే రకంగా వర్తించవు.


రాష్ట్రాల్లోని పండుగలు (Festivals), ఇతర సందర్భాల ఆధారంగా సెలవులు వేరువేరుగా ఉంటాయి. ఆర్‌బీఐ క్యాలెండర్ ప్రకారం.. రెండో, నాలుగో శనివారాలు (Second and Fourth Saturday), ఆదివారాలు (Sunday) కలుపుకుని ఆగస్ట్‌లో బ్యాంకులకు (August Holidays) 13 రోజులు సెలవు దినాలు (13 Days Bank Holidays) ఉండటం గమనార్హం. ఏఏ రోజు ఆగస్ట్‌లో బ్యాంకులు మూతపడనున్నాయో ఈ జాబితాలో తెలుసుకోగలరు.



ఆగస్ట్ 1: (సోమవారం) Drukpa Tshe-zi Festival (సిక్కింలో మాత్రమే బ్యాంకులకు సెలవు)

ఆగస్ట్ 7: (ఆదివారం) (వారాంతపు సెలవు)

ఆగస్ట్ 9: మొహర్రం (బ్యాంకులకు సెలవు)

ఆగస్ట్ 11: రక్షాబంధన్ (దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు)

ఆగస్ట్ 13: రెండో శనివారం (వీక్లీ హాలిడే)

ఆగస్ట్ 14: ఆదివారం (వారాంతపు సెలవు)

ఆగస్ట్ 15: స్వాతంత్య్ర దినోత్సవం (దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు)

ఆగస్ట్ 16: పార్శీ న్యూ ఇయర్ (ముంబై, నాగ్‌పూర్‌లో బ్యాంకులకు సెలవు)

ఆగస్ట్ 18: జన్మాష్టమి (దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు)

ఆగస్ట్ 21: ఆదివారం (వారాంతపు సెలవు)

ఆగస్ట్ 27: నాలుగో శనివారం (దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు)

ఆగస్ట్ 28: ఆదివారం (వారాంతపు సెలవు)

ఆగస్ట్ 31: వినాయక చవితి (దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు)



ఇదిలా ఉండగా జాతీయ మీడియా సంస్థల్లో కొన్ని మీడియా సంస్థలు తొమ్మిది రోజులు మాత్రమే సెలవని, 11 రోజులు సెలవని, మరికొన్నింటిలో 13 రోజులు మాత్రమే సెలవులని వార్తలను ప్రచురించాయి. దీంతో.. ఖాతాదారులు గందరగోళానికి లోనయ్యారు. రాష్ట్రాల వారీగా బ్యాంకు సెలవుల్లో మార్పు ఉంటుందని ఖాతాదారులు గమనించగలరు. బ్యాంకులకు సెలవులు ఉన్నప్పటికీ ఆన్‌లైన్‌లో బ్యాంకింగ్ కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయి.

Updated Date - 2022-07-24T23:24:44+05:30 IST