చైనా బ్యాంకులకు రిజర్వ్ అవసరాల తగ్గింపు * ఆర్థిక వ్యవస్థ మందగించిన ఫలితం

ABN , First Publish Date - 2022-04-16T00:05:25+05:30 IST

పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా(పీబీసీ) తన వెబ్‌సైట్‌లో ఈ నెల(ఏప్రిల్) 25 నుండి అమల్లోకి వచ్చేలా... అన్ని బ్యాంకులకు రిజర్వ్ రిజర్వ్‌మెంట్ రేషియో(ఆర్‌ఆర్‌ఆర్)ను 25 బేసిస్ పాయింట్లు(బీపీఎస్) తగ్గిస్తున్నట్లు పేర్కొంది. కాగా... విశ్లేషకులు ఈ చర్య సరిపోదని పేర్కొన్నారు.

చైనా బ్యాంకులకు రిజర్వ్ అవసరాల తగ్గింపు  * ఆర్థిక వ్యవస్థ మందగించిన ఫలితం

బీజింగ్ : పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా(పీబీసీ) తన వెబ్‌సైట్‌లో ఈ నెల(ఏప్రిల్) 25 నుండి అమల్లోకి వచ్చేలా... అన్ని బ్యాంకులకు రిజర్వ్ రిజర్వ్‌మెంట్ రేషియో(ఆర్‌ఆర్‌ఆర్)ను 25 బేసిస్ పాయింట్లు(బీపీఎస్) తగ్గిస్తున్నట్లు పేర్కొంది. కాగా... విశ్లేషకులు ఈ చర్య సరిపోదని పేర్కొన్నారు. ఉక్రెయిన్‌లో యుద్ధం, చైనాలో విస్తృతంగా వ్యాపించిన కోవిడ్-19 లాక్‌డౌన్‌లు, బలహీనమైన ఆస్తి మార్కెట్ ప్రపంచంలోని రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో మార్పులను ప్రేరేపించినట్లుగా వినవస్తోన్న విషయం తెలిసిందే. ఈ పరిణామాలు ప్రపంచ సరఫరా వ్యవస్థలోకి చొచ్చుకుపోతున్నాయన్న వ్యాఖ్యానాలు ఈ సందర్భంగా వినవస్తున్నాయి. కాగా... కొందరు ఆర్థికవేత్తలు... మాంద్యం సంబంధిత  ప్రమాదాలు పెరుగుతున్నాయనిచెబుతున్నారు. "ఈ ఆర్‌ఆర్‌ఆర్... ప్రస్తుత దశలో ఆర్థిక వ్యవస్థకు చాలా ముఖ్యమైనదిగా తాను భావించడం లేదని పిన్‌పాయింట్ అసెట్ మేనేజ్‌మెంట్‌లో చీఫ్ ఎకనామిస్ట్‌గా ఉన్న జివీ జాంగ్ పేర్కొన్నారు. 

Updated Date - 2022-04-16T00:05:25+05:30 IST