రేషన్‌ డీలర్ల ధర్నా

ABN , First Publish Date - 2021-10-27T05:50:25+05:30 IST

జీవో నెంబర్‌ 10 రద్దు చేయాలని, రేషన్‌ డీలర్ల సమస్యలు పరిష్కరించాలంటూ భీమడోలు, ఉంగుటూరు, దెందులూరు, ద్వారకాతిరుమల రేషన్‌ డీలర్లు పాతూరు ఎఫ్‌సీఐ గొడౌన్‌ ఎదుట ధర్నా చేశారు.

రేషన్‌ డీలర్ల ధర్నా
పాతూరు ఎఫ్‌సీఐ గొడౌన్‌ వద్ద ధర్నా చేస్తున్న రేషన్‌ డీలర్లు

భీమడోలు, అక్టోబరు 26 : జీవో నెంబర్‌ 10 రద్దు చేయాలని, రేషన్‌ డీలర్ల సమస్యలు పరిష్కరించాలంటూ భీమడోలు, ఉంగుటూరు, దెందులూరు, ద్వారకాతిరుమల రేషన్‌ డీలర్లు పాతూరు ఎఫ్‌సీఐ గొడౌన్‌ ఎదుట ధర్నా చేశారు. రేషన్‌ డీలర్ల సంఘం నాయకులు సలాది రామకృష్ణ, నీలంశెట్టి రాంబాబు, కేఎన్‌వీ ప్రసాద్‌, ఎస్‌కె షాకీర్‌ తదితరులు మాట్లాడుతూ జీవో నెంబర్‌ 10ని అమలు చేయడం ద్వారా రేషన్‌ డీలర్లు ఇబ్బందులకు గురవుతారని ఇప్పటికే చాలీ చాలని కమీషన్‌తో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారు. కరెంటు బిల్లులు, దిగుమతి కూలీ, షాపు నిర్వహణ, సిబ్బంది జీతాలు, ముఠా కూలీలకిచ్చే సొమ్ము ఖర్చులకు కూడా సరిపోవడం లేదని ప్రభుత్వం తమ మొర ఆలకించి న్యాయం చేయాలని కోరారు. 


Updated Date - 2021-10-27T05:50:25+05:30 IST