మట్టితవ్వకాలను అడ్డుకున్న నిర్వాసితులు

Sep 17 2021 @ 00:57AM
మట్టిని తరలిస్తున్న లారీని అడ్డుకుంటున్న నిర్వాసితులు

మర్రిగూడ, సెప్టెంబరు 16: పరిహారం ఇవ్వడంతోపాటు పునరావాసం కల్పించాలని శివన్నగూడెం రిజర్వాయర్‌ వద్ద మట్టితవ్వకాలను ముంపు గ్రామమైన లక్ష్మణాపురం గ్రామస్థులు గురువారం అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, ఆరేళ్లుగా ప్రభుత్వం పునరావాసం, పరిహారం ఇవ్వకుండా కాలయాపన చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం తెలుసుకున్న నాంపల్లి సీఐ గుమ్మడిదల సత్యం సిబ్బందితో అక్కడికి చేరుకొని బాధితులకు నచ్చజెప్పారు. అయినా వారు ససేమిరా అనడంతో పనులను నిలిపివేశారు. ఆందోళనలో నిర్వాసితులు బాడిగ శ్రీనివాస్‌, సైదులు, సంజీవ, లక్ష్మమ్మ, పుష్పమ్మ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on: