సీపీఎం పదవులకు, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా

Jul 26 2021 @ 00:58AM

జిల్లా మాజీ కార్యదర్శి కుమార్‌రెడ్డి వెల్లడి


తిరుపతి (తిలక్‌రోడ్డు/ఆటోనగర్‌), జూలై 25: సీపీఎం పదవులకు, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు జిల్లా మాజీ కార్యదర్శి కె.కుమార్‌ రెడ్డి వెల్లడించారు. ఆదివారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడారు. తన వ్యక్తిగత కారణాలతోపాటు, పార్టీలో ఇమిడి పని చేయడం ఇబ్బందికరంగా మారిందన్నారు. అందువల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఇంతకాలం తనకు సహకరించిన ప్రజా సంఘాలకు, పార్టీ సానుభూతి పరులకు, మిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. 


కుమార్‌రెడ్డిని బహిష్కరిస్తున్నాం : సీపీఎం

సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్న కె.కుమార్‌రెడ్డిని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు జిల్లా కార్యదర్శి ఎ.పుల్లయ్య ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ, పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.