నిరోధ స్థాయిలు 17850, 18000

ABN , First Publish Date - 2022-08-16T06:29:00+05:30 IST

నిఫ్టీ గత వారం పాజిటివ్‌గానే ప్రారంభమై మానసిక అవధి 17500ని ఛేదించి అప్‌ట్రెండ్‌ను కొనసాగించింది. చివరికి 300 పాయింట్ల లాభంతో వారం గరిష్ఠ స్థాయి

నిరోధ స్థాయిలు 17850, 18000

టెక్‌ వ్యూ


నిఫ్టీ గత వారం పాజిటివ్‌గానే ప్రారంభమై మానసిక అవధి 17500ని ఛేదించి అప్‌ట్రెండ్‌ను కొనసాగించింది. చివరికి 300 పాయింట్ల లాభంతో వారం గరిష్ఠ స్థాయి 17700 సమీపంలో ముగిసింది. గత ఎనిమిది వారాల్లో 15200 నుంచి ప్రారంభమైన బలమైన ర్యాలీలో 2500 పాయింట్ల వరకు లాభపడింది. మద్దతు స్థాయిలకు పైనే ఉంటూ ప్రతి ఒక్క నిరోధాన్ని ఛేదించుకుంటూ ముందుకు సాగింది. స్వల్పకాలిక ఓవర్‌బాట్‌ స్థితి ఏర్పడినందు వల్ల టెక్నికల్‌ కన్సాలిడేషన్‌ లేదా రియాక్షన్‌ తప్పనిసరి. గరిష్ఠ స్థాయిల్లో పలు నిరోధాలున్నందు వల్ల స్వల్పకాలిక ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలి. 


బుల్లిష్‌ స్థాయిలు: మరింత అప్‌ట్రెండ్‌ కోసం ప్రధాన నిరోధం 17850 (ఏప్రిల్‌ 8న ఏర్పడిన గరిష్ఠ స్థాయి) కన్నా పైన నిలదొక్కుకోవాలి. ప్రధాన నిరోధం 18000. ఇక్కడ కన్సాలిడేషన్‌ ఉండవచ్చు.


బేరిష్‌ స్థాయిలు: ఏ మాత్రం బలహీనత ప్రదర్శించినా సానుకూలత కోసం మద్దతు స్థాయి 17700 కన్నా పైన నిలదొక్కుకోవాలి. విఫలమైతే మరింత బలహీనపడుతుంది. స్వల్పకాలిక మద్దతు స్థాయి 17500. అంతకన్నా దిగజారితే స్వల్పకాలిక బలహీనతగా భావించి అప్రమత్తం కావాలి.


బ్యాంక్‌ నిఫ్టీ: గత వారం ఈ సూచీ బలమైన ర్యాలీని  సాధించి 39000 సమీపంలో క్లోజైంది. ప్రధాన నిరోధం 39500. ఆ పైన నిలదొక్కుకున్నప్పుడే మరింత అప్‌ట్రెండ్‌ ఉంటుంది. 39000 వద్ద విఫలమైతే స్వల్పకాలిక బలహీనత తప్పదు. 


పాటర్న్‌: మరింత అప్‌ట్రెండ్‌ కోసం 17850, 18000 వద్ద ‘‘అడ్డంగా ఏర్పడిన రెసిస్టెన్స్‌ ట్రెండ్‌లైన్‌’’ కన్నా పైన కోలుకోవాలి. మార్కెట్‌ ప్రస్తుతం 200 డిఎంఏ, ‘‘ఏటవాలుగా ఎగువకు ఏర్పడిన సపోర్ట్‌ ట్రెండ్‌లైన్‌’’ కన్నా పైన ఉంది. అంతకన్నా దిగజారితే స్వల్పకాలిక కరెక్షన్‌ అవకాశాలున్నాయి. 


టైమ్‌: ఈ సూచీ ప్రకారం బుధవారం మైనర్‌ రివర్సల్‌ ఉండవచ్చు. 


మంగళవారం స్థాయిలు

నిరోధం : 17810, 17850

మద్దతు : 17700, 17640

www.sundartrends.in

Updated Date - 2022-08-16T06:29:00+05:30 IST