ప్రజా సమస్యలు వెంటనే పరిష్కరించండి

ABN , First Publish Date - 2021-07-27T04:51:21+05:30 IST

అధికారుల వద్దకు సమస్య లు పరిష్కరించాని ప్రజలు వచ్చినపు డు వెంటనే న్యాయం చేసి పం పాలని కార్యాలయాల చుట్టూ తిప్పవద్దని ఆర్డీవో శ్రీనివాసులు అధికారులను ఆదేశించారు.

ప్రజా సమస్యలు వెంటనే పరిష్కరించండి
మహిళ ఫిర్యాదును పరిశీలిస్తున్న ఆర్డీఓ

 స్పందనలో ఆర్డీఓ శ్రీనివాసులు

జమ్మలమడుగు రూరల్‌, జూలై 26:అధికారుల వద్దకు సమస్య లు పరిష్కరించాని ప్రజలు వచ్చినపు డు వెంటనే న్యాయం చేసి పం పాలని కార్యాలయాల చుట్టూ తిప్పవద్దని  ఆర్డీవో శ్రీనివాసులు అధికారులను ఆదేశించారు. సోమవారం స్పందన కార్యక్రమంలో పెద్దముడియం మండలం పెద్దపసుపుల గ్రామానికి చెందిన ముడి యం నాగేశ్వరమ్మ అనే బాధిత మహి ళ  42 సెంట్ల తన సొంత పొలాన్ని దాన విక్రయంగా రిజిస్ట్రేషన్‌ చేసి ఇచ్చినా అధికా రులు పాసుపుస్తకం ఇవ్వకుండా తిప్పుకుంటున్నారని ఆర్డీఓకు విన్నవించింది. దువ్వూ రు మండలం వెంకుపల్లెలోని 161 సర్వే నంబరులో పొలం ఉందని గతేడాది తల్లి వెంకటసుబ్బమ్మ చనిపోవడంతో ఆ పొలంపై తనకు పట్టాదారు పాస్‌పుస్తకం మం జూరు చేయాలని  దువ్వూరు రెవెన్యూ ఽఅధికారులకు అన్ని డాక్యుమెంట్లతో దర ఖా స్తు ఇచ్చినా తహసీల్దారు తిరస్కరించి పంపినట్లు వాపోయింది. వెంటనే ఆర్డీవో శ్రీనివాసులు ఆమె ఇచ్చిన ఫిర్యాదు పత్రాన్ని తీసుకుని దువ్వూరు తహసీల్దారుకు ఫోన్‌ చేసి అన్నీ డాక్యుమెంట్లు సక్రమంగా ఉన్నప్పుడు ఎందుకు మహిళకు పాస్‌పుస్తకం మంజూరు చేయలేదని ప్రశ్నించారు. ఇలాంటి సమస్య తిరిగి రాకూడదని, కార్యాలయం వద్దకు వచ్చిన ప్రజలకు వెంటనే న్యాయం చేయాలని ఆదేశించారు. ఫిర్యాదు చేసిన మహిళకు భరో సా ఇచ్చి సమస్య పరిష్కరిస్తామని ఆర్డీఓ చెప్పారు. 

Updated Date - 2021-07-27T04:51:21+05:30 IST