సాంకేతిక సమస్యలకు స్వస్తి

ABN , First Publish Date - 2022-07-05T05:49:37+05:30 IST

ప్రజా పంపిణీ వ్యవస్థలో అటు రేష న్‌ డీలర్లు, ఇటు లబ్ధిదారులు ఎదుర్కొంటున్న సాంకేతిక సమస్యలకు స్వ స్తి పలికేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

సాంకేతిక సమస్యలకు స్వస్తి

- రేషన్‌ డీలర్లకు అందుబాటులోకి 4జీ  పరికరాలు

- టీ వ్యాలెట్‌ సేవలకు సైతం అవకాశం

- జిల్లాలో 587 రేషన్‌ దుకాణాలు

జగిత్యాల, జూలై 4 (ఆంధ్రజ్యోతి): ప్రజా పంపిణీ వ్యవస్థలో అటు రేష న్‌ డీలర్లు, ఇటు లబ్ధిదారులు ఎదుర్కొంటున్న సాంకేతిక సమస్యలకు స్వ స్తి పలికేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అందుబాటులో వచ్చి న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ప్రభుత్వం పలు మార్పులకు శ్రీకారం చుడుతోంది. తద్వారా పారదర్శకతతో పాటు లబ్ధిదారులకు సం పూర్ణ ప్రయోజనం అందేలా సంస్కరణలు చేపట్టింది. ఇందులో భాగంగా 4జీ అనుసంధానమైన ఈ పాస్‌ పరికరాలను అందుబాటులోకి తెచ్చింది. గత పక్షం రోజుల నుంచి రేషన్‌ డీలర్లకు ఈ పాస్‌ పరికరాలను అందిం చడం ప్రారంభించారు. ప్రస్తుతం వీటిని వినియోగించి రేషన్‌ సరు కుల ను లబ్ధిదారులకు అందించడానికి చర్యలు తీసుకున్నారు. విజన్‌ టెక్‌ కం పెనీకి చెందిన కొత్త ఈ పాస్‌ యంత్రాలను పంపిణీ చేశారు. ఈ పాస్‌ యంత్రాల వినియోగంపై రేషన్‌ డీలర్లకు అవగాహన కల్పించారు.

జిల్లాలో పరిస్థితి ....

జిల్లాలోని పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన 587 రేషన్‌ దుకాణాల ద్వారా ప్రతీ నెల పేదలకు ఉచిత బియ్యం, రేషన్‌ బియ్యం పంపిణీ జ రుగుతోంది. జిల్లాలో మొత్తం 3,10,545 రేషన్‌ కార్డులుండగా ఇందులో 2,95,916 ఆహార భద్రతా కార్డులు, 14,483 అంత్యోదయ కార్డులు, 146 అ న్నపూర్ణ కార్డులున్నాయి. ప్రతీనెల సుమారు 9,369 మెట్రిక్‌ టన్నుల రేషన్‌ బియ్యాన్ని సుమారు 9,04,521 మందికి పౌరసరాఫరా శాఖ ద్వారా పంపిణీ చేస్తున్నారు.

దుర్వినియోగానికి చెక్‌...

పౌరసరఫరాల శాఖలో ఈ పాస్‌ విధానం సంపూర్ణంగా అమలు చేసి దుర్వినియోగానికి చెక్‌ పెట్టడానికి అధికారులు చర్యలు తీసుకున్నారు. వేలిముద్రల సమస్యల పరష్కారానికి ఐరిష్‌ విధానాన్ని అమలు చేయాల ని సర్కారు నిర్ణయించింది. ఇతర రంగాల్లో ఇంటర్‌ నెట్‌ వినియోగం ఎప్ప టికప్పుడు అధునీకీకరిస్తూ వడివడిగా 5జీ వైపు అడుగులు వేస్తోంది. ని త్యావసర సరుకుల పంపిణీకి రేషన్‌ దుకాణాల్లో మాత్రం ఇంకా 2జీ, 3జీ ఆధారిత పరికరాలను వినియోగిస్తున్నారు. దీంతో క్షేత్ర స్థాయిలో పలు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రధానంగా సిగ్నల్‌ సమస్య, సర్వర్‌ సమ స్యలు లబ్ధిదారులను, రేషన్‌ డీలర్లకు అవస్థలకు గురిచేస్తోంది. సమస్య ప రిష్కారానికి సర్కారు ప్రత్యేక చర్యలు చేపట్టింది. అధునీకరణ ఈ పాస్‌ పరికరాలను అందుబాటులోకి తెచ్చింది.  

తప్పనున్న తిప్పలు..

రేషన్‌ దుకాణాల్లో ఇప్పటివరకు ఎదురైన సర్వర్‌ సమస్యలు, సిగ్నల్‌ సమస్యలు తప్పనున్నాయి. 2జీ, 3జీ సిమ్‌లకు సిగ్నల్స్‌ సక్రమంగా అం దకపోవడంతో సరుకుల పంపిణీలో జాప్యం ఏర్పడుతుండేది. తాజా పరి కరాలతో సమస్య దూరం కానుందని డీలర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నా రు. 4జీ నెట్‌ వర్క్‌తో పనిచేసే ఈ పాస్‌ యంత్రాలను డీలర్లు వినియో గిస్తుండడంతో సాంకేతిక సమస్యలు ఎదురయ్యే అవకాశాలు లేకుండా పోయాయి. ఏదైనా సందర్బంలో సిగ్నల్స్‌ రాకపోయినా, అక్కడ అందుబా టులో ఉండే ఇతర 4జీ, వైఫై నెట్‌ వర్క్‌లను వినియోగించుకునే అవ కాశం కల్పించారు. ఫలితంగా ఇంటర్‌ నెట్‌ వినియోగంలో ఎదురయ్యే సాంకేతిక సమస్యలు తొలిగిపోనున్నాయి. గతంలో అందజేసిన ఈపాస్‌ యంత్రాల కాలపరిమితి ముగియడం వల్ల వాటితో సాంకేతిక సమస్యలు ఏర్పడుతున్నాయి. పరిస్థితిని గమనించిన అధికారులు పాత వాటి స్థానం లో కొత్త యంత్రాలను అందించారు. తూకంలో ఏ మాత్రం కొత్త యం త్రాల వల్ల సంబంధిత ప్రక్రియ పూర్తి అయ్యే అవకాశాలు లేవు. తూకం సరిగా ఉంటేనే ప్రక్రియ పూర్తయ్యేలా నూతన యంత్రాలను రూపొందిం చారు. దీంతో పాటు లబ్ధిదారులకు రశీదు అందించేలా అవకాశం కల్పించారు.

టీ-వ్యాలెట్‌ సేవలు వినియోగానికి అవకాశం..

మునుముందు రోజుల్లో రేషన్‌ దుకాణాల్లో టీ-వ్యాలెట్‌ సేవలు విని యోగించుకోవచ్చు. ప్రస్తుతం ప్రభుత్వం అందించిన నూతన యంత్రాల సహాయంతో టీ-వ్యాలెట్‌ సేవలు సైతం పొందే అవకాశాలున్నట్లు సం బంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. రేషన్‌ డీలర్లు నిత్యావసర వస్తువుల సరుకుల పంపిణీతో పాటు ఇతర సేవలను సైతం నిర్వహించే అవకా శాలు కనిపిస్తున్నాయి. విద్యుత్‌, సెల్‌ఫోన్‌ చెల్లింపులు, రైలు టిక్కెట్లు, బస్సు టిక్కెట్ల రిజర్వేషన్లు, బ్యాంకు ఖాతాల్లో నగదు జమ, విత్‌ డ్రా తది తర డిజిటల్‌ లావాదేవీలు అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. దీంతో వినియోగదారులకు డిజిటల్‌ సేవలు మరింత సులభం కానున్నా యి. అదే సమయంలో డీలర్లకు కమీషన్‌ పెరగడంతో పాటు క్షేత్ర స్థా యిలో ఇబ్బందులు దూరం కానున్నాయి. 


4జీ నెట్‌వర్క్‌ ఈ పాస్‌ యంత్రాలు అందాయి

- గాజెంగి నందయ్య, జిల్లా రేషన్‌ డీలర్ల సంఘం అధ్యక్షుడు

జిల్లాలోని రేషన్‌ దుకాణాలకు ప్రభుత్వం ఇటీవల 4జీ నెట్‌ వర్క్‌కు సపోర్టు చేసే ఈ పాస్‌ యంత్రాలు అందించారు. సంబంధిత యంత్రా లతో అదనపు ప్రయోజనాలు అందనున్నాయి. ప్రస్తుతం నెల నుంచి రేష న్‌ సరుకులను కొత్త యంత్రాల ద్వారా అందించనున్నాము.

సమస్యల పరిష్కారానికే...

- చందన్‌ కుమార్‌, జిల్లా పౌరసరాఫరా శాఖ అధికారి

రేషన్‌ దుకాణాల్లో లబ్ధిదారులకు సరుకుల పంపిణీలో ఎలాంటి సమ స్యలు ఎదురుకాకుండా ఉండేందుకే నూతన పరికరాలను అందిం చాము. గతంలో అందించిన పరికరాల గడువు ముగియడంతో కొత్త కంపెనీ పరికరాలను అందించాము. దీనివల్ల పలు సమస్యలు పరిష్కారమవుతాయి. 

Updated Date - 2022-07-05T05:49:37+05:30 IST