స్పందన అర్జీలను వేగవంతంగా పరిష్కరించాలి : కలెక్టర్‌

ABN , First Publish Date - 2022-05-16T05:30:00+05:30 IST

జిల్లా కేంద్రంలో జరిగే ప్రజా ఫిర్యాదుల స్పందన కార్యక్రమానికి వచ్చే బాధితుల సమస్యలను ఆయా శాఖల అధికారులు వేగవంతంగా పరిష్కరించాలని కలెక్టర్‌ విజయరామరాజు ఆదేశించారు.

స్పందన అర్జీలను వేగవంతంగా పరిష్కరించాలి : కలెక్టర్‌
స్పందనలో మాట్లాడుతున్న కలెక్టర్‌ విజయరామరాజు

కడప(కలెక్టరేట్‌) మే 16 : జిల్లా కేంద్రంలో జరిగే ప్రజా ఫిర్యాదుల స్పందన కార్యక్రమానికి వచ్చే బాధితుల సమస్యలను  ఆయా శాఖల అధికారులు వేగవంతంగా పరిష్కరించాలని కలెక్టర్‌ విజయరామరాజు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని స్పందన హాలులో ప్రజా  ఫిర్యాదుల స్పందన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కలెక్టర్‌ తో పాటు జిల్లా రెవెన్యూ అధికారి మలోల, డ్వామా పీడీ యధు భూషణ్‌రెడ్డి, స్పెషల్‌ కలెక్టర్‌ రామ్మోహన్‌, అనుడా వీసీ శ్రీలక్ష్మీలు హాజరయ్యారు. ఈసందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు తమ విన్నపాలను కలెక్టర్‌కు సమర్పించారు. వాటిని క్షుణ్ణంగా పరిశీలించిన మీదట తదుపరి చర్యలకు సంబంధిత అధికా రులకు సిఫార్సు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదులను పారదర్శకంగా నిర్ణీత గడువులోగా అధికారులు పరి ష్కరించాలన్నారు పెండింగ్‌  బియాండ్‌  ఎస్‌ఎల్‌ఏ, రీఓపెనింగ్‌ లేకుం డా అర్జీదారుడు సంతృప్తి చెందేలా అర్జీలను పరిష్కరించాలన్నారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి  అధికారులు లక్ష్యా ల ను సాధించాలని కలెక్టర్‌ ఆదేశించారు. కొవిడ్‌ ముప్పు పూర్తిగా  తొల గిపోలేదని ప్రతి ఒక్కరూ కొవిడ్‌ ప్రొటోకాల్‌ పాటించాలన్నారు. జిల్లా అధికారులు ప్రభాకర్‌రెడ్డి, డాక్టర్లు నాగరాజు, ప్రసాదు, వెంకట  సుబ్బ య్య, కృష్ణయ్య, సుభాషిణి, శోభవలెంటీనా, బ్రహ్మయ్య, సుధాకర్‌ రెడ్డి, మురళీధర్‌, నాగేశ్వరరావు, వజ్రశ్రీ అన్నిశాఖల అధికారులు పాల్గొన్నారు.

 

Updated Date - 2022-05-16T05:30:00+05:30 IST