Smriti Irani కుమార్తె రెస్టారెంట్‌కు ఎక్సైజ్ శాఖ షోకాజ్ నోటీసు

ABN , First Publish Date - 2022-07-23T16:13:18+05:30 IST

కేంద్రమంత్రి స్మృతి ఇరానీ(Smriti Irani) కుమార్తె జోయిష్ ఇరానీకి గోవా ఎక్సైజ్ శాఖ షాక్ ఇచ్చింది....

Smriti Irani కుమార్తె రెస్టారెంట్‌కు ఎక్సైజ్ శాఖ షోకాజ్ నోటీసు

పనాజీ(గోవా): కేంద్రమంత్రి స్మృతి ఇరానీ(Smriti Irani) కుమార్తె జోయిష్ ఇరానీ (Zoish Irani)కి గోవా (Goa) ఎక్సైజ్ శాఖ షాక్ ఇచ్చింది. గోవాలో రెస్టారెంట్ నడుపుతున్న స్మృతి ఇరానీ కుటుంబం మోసపూరిత మార్గాల ద్వారా మద్యం లైసెన్స్(Liquor License) పొందిన వ్యవహారం గోవాలో సంచలనం రేపింది. దీంతో గోవా ఎక్సైజ్ శాఖ కమిషనర్ నారాయణ్ ఎం గాడ్ రెస్టారెంట్‌కు షోకాజ్ నోటీసు జారీ చేశారు.గోవాలోని అస్సాగోలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కుమార్తె జోయిష్ ఇరానీ నిర్వహిస్తున్న ‘సిల్లీ సోల్స్ కేఫ్ అండ్ బార్’ (Silly Souls Cafe and Bar)అనే  రెస్టారెంట్ నిర్వహిస్తోంది.మరణించిన వ్యక్తి పేరును ఉపయోగించి రెస్టారెంట్‌లో మద్యం లైసెన్స్‌ను దాని యజమానులు పునరుద్ధరించినట్లు వెలుగుచూడటంతో ఈ లైసెన్సు వ్యవహారం వివాదంలో పడింది.


గోవా ఎక్సైజ్ కమిషనర్ నారాయణ్ ఎమ్ గాడ్ జులై 21వతేదీన రెస్టారెంట్‌కు షోకాజ్ నోటీసు (show cause notice) జారీ చేశారు. జులై 29వతేదీన ఈ అంశంపై కోర్టులో విచారణ జరగనుంది.షోకాజ్ నోటీసు ప్రకారం లైసెన్స్ హోల్డర్ గత ఏడాది మే 17 మరణించినప్పటికీ, రెస్టారెంట్ మద్యం లైసెన్స్ గత నెలలో పునరుద్ధరించారు.ఈ ఏడాది జూన్ 22వ తేదీన ఆంథోనీ‌ద్గామా పేరుతో రెస్టారెంట్ లైసెన్స్ రెన్యూవల్ కోసం దరఖాస్తు చేశారు. అయితే ఆంథోని మే 2021లో మరణించారని షోకాజ్ నోటీసులో పేర్కొన్నారు. 


 కేంద్ర మంత్రి కుటుంబంతో పాటు ఎక్సైజ్ అధికారులు, స్థానిక అస్సాగావో పంచాయితీ కలిసి చేసిన మెగా మోసంపై సమగ్ర విచారణ జరపాలని లాయర్ రోడ్రిగ్స్ కోరుతున్నారు.సిల్లీ సోల్స్ కేఫ్,బార్‌లకు గోవా రాష్ట్రంలో కార్యకలాపాలు నిర్వహించడానికి ఇప్పటికీ రెస్టారెంట్ లైసెన్స్ లేదని వాదించారు. విదేశీ మద్యం,భారతీయ నిర్మిత విదేశీ మద్యానికి లైసెన్స్ ఇవ్వడానికి ఎక్సైజ్ శాఖ నిబంధనలను వంచిందని న్యాయవాది ఆరోపించారు. యజమానులు. ఎక్సైజ్ నిబంధనల ప్రకారం ఇప్పటికే ఉన్న రెస్టారెంట్ మాత్రమే మద్యం లేదా బార్ లైసెన్స్ పొందవచ్చని ఆయన నొక్కి చెప్పారు.





2020వ సంవత్సరం డిసెంబరులో జారీ చేసిన ఆంథోని ఆధార్ కార్డు ప్రకారం అతను ముంబైలోని విలే పార్లే నివాసి. లాయర్ రోడ్రిగ్స్ తన ఫిర్యాదును ధృవీకరించడానికి ముంబై మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఆంథోని మరణ ధృవీకరణ పత్రాన్ని కూడా పొందారు.మద్యం లైసెన్స్ పునరుద్ధరణ దరఖాస్తులో ‘‘దయచేసి 2022-23 సంవత్సరానికి ఈ లైసెన్స్‌ను పునరుద్ధరించండి,ఆరు నెలల్లోగా ఈ లైసెన్స్‌ను బదిలీ చేస్తానని’’ లైసెన్స్ హోల్డర్ తరపున ఎవరో సంతకం చేశారని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ తెలిపింది.ఈ చట్టవ్యతిరేక చర్య గురించి పక్కా సమాచారం తెలుసుకున్న లాయర్ రోడ్రిగ్స్ ఆర్టీఐ అప్లికేషన్ ద్వారా రెస్టారెంట్ లైసెన్స్ రెన్యువల్ కోసం ఉపయోగించిన మోసపూరిత పత్రాలను కనుగొన్నారు.

Updated Date - 2022-07-23T16:13:18+05:30 IST