బస్సు లేక గోస...సర్వీసును పునరుద్ధరించాలని గ్రామస్థుల విజ్ఞప్తి

ABN , First Publish Date - 2020-11-24T10:28:38+05:30 IST

హన్మకొండ నుంచి తాడిచర్లకు వచ్చే వరంగల్‌-1 డిపో బస్సు సర్వీనును పునరుద్దరించాలని తాడిచర్ల, మల్లారం, చిన్నతూండ్ల, పెద్దతూండ్ల గ్రామాలకు చెందిన గ్రామస్థులు కోరుతున్నారు. 20 ఏళ్లుగా సాగుతున్న బస్సు సేవలను

బస్సు లేక గోస...సర్వీసును పునరుద్ధరించాలని గ్రామస్థుల విజ్ఞప్తి

మల్హర్‌, నవంబరు 23 : హన్మకొండ నుంచి తాడిచర్లకు వచ్చే వరంగల్‌-1 డిపో బస్సు సర్వీనును పునరుద్దరించాలని తాడిచర్ల, మల్లారం, చిన్నతూండ్ల, పెద్దతూండ్ల గ్రామాలకు చెందిన గ్రామస్థులు కోరుతున్నారు. 20 ఏళ్లుగా సాగుతున్న బస్సు సేవలను కరోనా సమయంలో నిలిపి వేశారని,  సుమారు ఎనిమిది నెలల నుంచి బస్సు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని అంటున్నారు.  ఉదయం, రాత్రి రెండు ట్రిప్పులు గ్రామానికి బస్సు వచ్చేదని, బస్సు నడిచే సమయంలో ఏ రాత్రైన ఇంటికి చేరుతామనే నమ్మకం ఉండేదని అంటున్నారు. వరంగల్‌, హన్మకొండకు బస్సు సౌకర్యం ఉన్నప్పుడు వివిఽధ పనులు నిమిత్తం ప్రజలు వెళ్లే వారని గుర్తు చేస్తున్నారు. ప్రస్థుతం బస్సు సౌకర్యం లేకపోవడం వల్ల ఇబ్బందులు తప్పడం లేదంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బస్సు సర్వీసును పునరుద్ధరించి తమ ఇబ్బందులను తొలగించాలని తాడిచర్ల, మల్లారం, చిన్నతూండ్ల, పెద్దతూండ్ల గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2020-11-24T10:28:38+05:30 IST