183 బస్తాల రేషన్‌ బియ్యం స్వాధీనం

ABN , First Publish Date - 2020-12-03T06:38:46+05:30 IST

రేషన్‌ బియ్యాన్ని అక్రమంగా తరలి స్తున్న లారీని ఇంకొల్లు ఎస్‌ఐ ప్రసాద్‌ ఆధ్వర్యంలో సిబ్బంది బుధవారం తెల్లవారుజామున తిమ్మసముద్రం, గొల్లపాలెం మధ్య పట్టుకున్నారు.

183 బస్తాల రేషన్‌  బియ్యం స్వాధీనం
పట్టుబడిన రేషన్‌బియ్యం లారీ



ఇద్దరిని అదుపులోకి తీసుకున్న ఇంకొల్లు పోలీసులు

మొత్తం 8 మందిపై కేసు

ఇద్దరిని అదుపులోకి తీసుకున్న ఇంకొల్లు పోలీసులు

మొత్తం 8 మందిపై కేసు

చీరాల/ఇంకొల్లు, డిసెంబరు 2 : రేషన్‌ బియ్యాన్ని అక్రమంగా తరలి స్తున్న లారీని ఇంకొల్లు ఎస్‌ఐ ప్రసాద్‌ ఆధ్వర్యంలో సిబ్బంది బుధవారం తెల్లవారుజామున తిమ్మసముద్రం, గొల్లపాలెం మధ్య పట్టుకున్నారు. ఇం కొల్లు, కారంచేడు, పర్చూరు మండలాల పరిధిలో రేషన్‌ బియ్యం అక్రమ రవాణా దందాపై ‘ఇంకొల్లు, పర్చూరు టూ పేట’ శీర్షికన ఆంధ్రజ్యోతిలో కథనం ప్రచురింతమైంది. దీంతో సీఐ అల్తాఫ్‌ హుస్సేన్‌ ఇంకొల్లు సర్కిల్‌ పరిధిలోని అన్ని స్టేషన్లలో ఎస్‌ఐలను అప్రమత్తం చేశారు. ఈ నేపథ్యం లో ఇంకొల్లు ఎస్‌ఐ ప్రసాద్‌ సిబ్బందితో నిర్వహించిన దాడుల్లో తిమ్మస ముద్రం, గొల్లపాలెం మధ్య రేషన్‌ బియ్యంను అక్రమంగా రవాణా చేస్తు న్న లారీని బుధవారం తెల్లవారుజామున పట్టుకున్నారు. అందులో 183బ స్తాలు రేషన్‌ బియ్యం ఉన్నట్లు ఎస్‌ఐ ప్రసాద్‌ చెప్పారు. లారీడ్రైవర్‌ వీరాం జనేయులు, సుబ్బారావు అనే మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. లారీని సీజ్‌ చేశారు. దీనికి సంబంధించి మొత్తం ఎనిమిది మందిపై కేసు నమోదు చేశామన్నారు. పట్టుబడిన బియ్యానికి సంబంధించి ఇంకొల్లు తహసీల్దార్‌ ప్రసాదరావుకు నివేదించామన్నారు.  


Updated Date - 2020-12-03T06:38:46+05:30 IST